Homeఅంతర్జాతీయంట్రంప్‌కు ఎదురు దెబ్బ

ట్రంప్‌కు ఎదురు దెబ్బ

- Advertisement -

డెమొక్రాట్లకు ఆధిక్యత…
భారతీయుల సత్తా!
చారిత్రక విజయాల వేదికగా మధ్యంతర ఎన్నికలు

వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారాయి. ట్రంప్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల ఫలితాలు గట్టి ఎదురు దెబ్బగా పరిణమిచ్చాయి. డెమొక్రాట్టకు అనుకూలంగా ప్రజల తీర్పు వచ్చింది. అమెరికాలో భారత సంతతి పౌరుల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక పరిస్థితులు, యుద్ధాలు వంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా నిలిచాయి. డెమొక్రటిక్ పార్టీ కీలక స్థానాలు కైవశం చేసుకున్నది. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. మహిళలు, నల్లజాతీయులు, స్థానిక అమెరికన్ తెగలకు చెందినవారు, ముస్లింలు, ఎల్‌జీబీటీక్యూG వర్గాల అభ్యర్థులు చారిత్రక విజయాలు అందుకున్నారు. డెమొక్రాట్లకు 54 స్థానాలు గెలుచుకోగా, రిపబ్లికన్లకు 44 స్థానాలు దక్కాయి. మెజారిటీ కోసం మరో 51 స్థానాలతో ప్రాతినిధ్యం అవసరం. దీంతో అమెరికా కాంగ్రెస్‌పై డెమొక్రాట్ల పట్టు సాధించినట్లు తాజా గణాంకాలు పేర్కొన్నాయి. సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ సత్తా చాటారు. కాంగ్రెస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించారు. రిపబ్లికన్ల నుంచి ఏడు సెనేట్ స్థానాలు కైవసం చేసుకున్నారు. టెకాస్స్, కాన్సాస్, అయోవా, నార్త కరోలినా, సౌత్ కరోలినా, ఒహియో, మైనే రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేశారు.
ఇదిలావుంటే, అమెరికా 250 ఏళ్ల రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. జాతి, లింగం, మతం, లైంగిక గుర్తింపుతో సంబంధం లేకుండా వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులు కీలక పదవులను కైవసం చేసుకున్నారు. న్యూ మెక్సికో గవర్నర్‌గా డెమొక్రటిక్ అభ్యర్థి డెబ్ హాలండ్ ఎన్నికయ్యారు. లగునా ప్యూబ్‌లో తెగకు చెందిన తొలి అమెరికన్ మహిళా గవర్నర్‌గా ఆమె నిలిచారు. గతంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగానూ పనిచేశారు. అలాగే జార్జియా గవర్నర్‌గా కీషా లాన్స్‌ బాటమ్స్‌ తొలి నల్లజాతి మహిళా గవర్నర్‌గా చరిత్రకెకాక్కరు. న్యూ హాంప్షైర్‌లో క్రిస్ పప్పాస్… సెనేట్‌కు ఎన్నికయ్యారు. సెనేట్‌లో అడుగుపెట్టబోయే తొలి స్వలింగ సంపర్కుడిగా గుర్తింపు పొందారు. గతంలో అట్లాంటాకు మేయర్‌గా క్రిస్ పనిచేశారు. ఫ్లోరిడాలో రిపబ్లికన్ అభ్యర్థి బైరన్ డొనాల్డ్స్‌ ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర తొలి నల్లజాతి గవర్నర్‌గా నిలిచారు. మిన్నెసోటాలో పెగ్గీ ఫ్లానగన్… సెనేట్‌కు ఎన్నికైన తొలి స్థానిక అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. ఓహియో రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా అమీ ఆకట్న్ ఎన్నికయ్యారు. టెకాస్స్‌కు తొలి లాటినా గవర్నర్‌గా గినా హినోజోసా నిలిచారు. అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం అమెరికన్గా అబ్దుల్ ఎల్-సయీద్, న్యూజెర్సీ నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ముస్లింగా ఆడమ్ హమావీ చరిత్ర సృష్టించారు. ఇల్లినాయిస్ నుంచి సెనేట్‌కు ఎన్నికైన నల్లజాతి మహిళల్లో జులియానా స్రాట్టన్ ఒకరు. ఆమెతో పాటు లిసా బ్లంట్ రోచెస్టర్, ఏంజెలా ఆల్స్బ్రూక్స్‌ కూడా సెనేట్‌లో నల్లజాతి మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచారు.
అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాతినిధ్యం మరింత పెరిగింది. భారత సంతతి అమెరికన్లు అనేక స్థానాల్లో విజయం సాధించారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమొక్రటిక్ అభ్యర్థి పియా దండియా విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌ను ఓడించి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. భారతీయ వలసదారుల కుటుంబంలో జన్మించిన ఆమె గతంలో ఉపాధ్యాయురాలిగా, హైస్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వైట్‌హౌస్ ఫెలోగా సేవలందించడంతో పాటు యాపిల్ సంస్థలోనూ పనిచేశారు. వర్జీనియాలోని 10వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమొక్రటిక్ అభ్యర్థి సుహాస్ సుబ్రమణ్యం తిరిగి విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్విత్పై ఆయన 63.16 శాతం ఓట్లు సాధించారు. ఆయనకు 1,73,106 ఓట్లు లభించాయి. వర్జీనియాలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి భారతీయ అమెరికన్గా సుహాస్ నిలిచారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణ మిల్లర్ మరోసారి ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ గవర్నర్ వెస్ మూర్‌తో కలిసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి రో ఖన్నా విజయం సాధించినట్లు ఎన్నికల నివేదికలు వెల్లడించాయి. సిలికాన్ వ్యాలీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సాంకేతిక రంగం, తయారీ పరిశ్రమలు, కార్మికుల హక్కుల అంశాలపై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అలాగే అమీ బెరా కూడా కాలిఫోర్నియాలో మరోసారి విజయం సాధించినట్లు నివేదికలు వెల్లడించాయి. నార్త కరోలినాలో మహేశ్ గణోరక్కర్, టెకాస్స్‌లో పూజా సేథీ వంటి అభ్యర్థుల ఫలితాలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు