- Advertisement -
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకిగాను నిర్వహించే డీఎస్‌సీ నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 2,721 పోస్టులకు మినీ నోటిఫికేషన్‌ను గతనెల 13న విడుదల చేసింది. తాజాగా జారీ చేయబోయే నోటిఫికేషన్‌లో దరఖాస్తుల స్వీకరణ నుంచి పరీక్షల తేదీలు, సిలబస్‌పై వివరణ ఉండనుంది. స్కూల్ అసిస్టెంట్లు931, స్కూల్ అసిస్టెంట్లు (స్పెషల్ ఎడ్యుకేషన్) 255, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ)`1231, ఎస్‌జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 304 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.


