Thursday, January 15, 2026
Homeఅంతర్జాతీయంపిల్లలకు ఉచితంగా దీపావళి టపాసులు పంపిణీ

పిల్లలకు ఉచితంగా దీపావళి టపాసులు పంపిణీ

- Advertisement -

పిల్లల కళ్ళల్లో ఆనందం కోసమే దీపావళి
… ఉదయ భాస్కర్ సలాది

విశాలాంధ్ర – పెరవలి : దీపావళి అంటేనే పిల్లలు పండుగ అని దీపావళి పండుగను చిన్నపిల్లల ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పిల్లల కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే గత 9 సంవత్సరాలుగా ముక్కామల గ్రామంలోని పిల్లలకు దీపావళి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వశిష్ట వినియోగదారుల సంఘం అధ్యక్షులు, పెరవలి మండలం లయన్స్ క్లబ్ సెక్రటరీ, ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఏవోఐ అధ్యక్షులు సలాది ఉదయభాస్కరరావు అన్నారు. అక్టోబర్ 20 వ తేదీ సోమవారం దీపావళి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో చిన్నారులకీ బిస్కెట్ ప్యాకెట్, దీపావళి మందులతో కూడిన సంచులు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం దీపావళికి తన తల్లిదండ్రులు రిటైర్డ్ లైబ్రేరియన్ సలాది వీర వెంకట సూర్యనారాయణ శ్రీమతి రాజేశ్వరి దంపతులు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తన పెద్ద కుమార్తె సలాది దుర్గాభారతి అల్లుడు హర్షవర్ధన్ దంపతులు, చిన్న కుమార్తె డాక్టర్ సలాది శ్రీ రాజేశ్వరి ఎంబిబిఎస్ మక్కామల వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు అన్నారు. ప్రతి ఏటా ఇలా దీపావళి మందులు ఉచితంగా ఇస్తూ ఉండటంతో గ్రామంలోని పిల్లలందరూ భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల కేరింతలతో సందడితో ఆ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు