Homeఆంధ్రప్రదేశ్జులై 14లోగా ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు ఉండదు

జులై 14లోగా ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు ఉండదు

- Advertisement -

ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఇంకా 27,93,334 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తి కాలేదు. ఎన్నికల సంఘం అధికారిక గణాంకాల ప్రకారం, వీరిలో 27,86,205 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇప్పటికే పంపిణీ చేసినప్పటికీ, వారు సమర్పించిన వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉంది.
మరో 7,129 మంది ఓటర్లకు మాత్రం ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందించలేకపోయారు.
అధికారుల సమాచారం ప్రకారం, కొంతమంది ఓటర్లు తమ చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం,నమోదైన ఫోన్ నంబర్లు పనిచేయకపోవడం లేదా సంప్రదించినా స్పందించకపోవడం వల్ల పత్రాల పంపిణీ సాధ్యపడలేదు.

రెండు రోజుల సమయం మాత్రమే..
ఈ పత్రాలను అందించడం,ఓటర్లు నింపిన పత్రాలను తిరిగి స్వీకరించడం,వాటిని పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి డిజిటైజేషన్ పూర్తి చేయడం కోసం ఇక రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఇప్పటికే పంపిణీ చేసిన పత్రాల్లో ఎన్ని తిరిగి అధికారులకు అందాయనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 4,16,20,565 మందికి, అంటే 99.98 శాతం మందికి, ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
వీరిలో 3,88,34,360 మంది (93.29 శాతం) తమ వివరాలు నింపిన పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) తిరిగి అందజేశారు. ఆ పత్రాల డిజిటైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.

90 శాతం దాటిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్
అయితే ఇప్పటికే పంపిణీ చేసిన పత్రాల్లో 27,86,205 పత్రాల డిజిటైజేషన్ మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉంది. వీటిలో అధిక భాగం పట్టణాలు, నగర ప్రాంతాలకు చెందిన ఓటర్లవేనని అధికారులు చెబుతున్నారు. నిర్ణయించిన గడువులోపు వీటిలో సుమారు 20 నుంచి 21 లక్షల మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి అందే అవకాశం ఉందని అనధికారికంగా అంచనా వేస్తున్నారు.
అయితే డబుల్ ఎంట్రీలు, మరణించిన ఓటర్లు, గుర్తించలేని(Uఅcశీశ్రీశ్రీవctabశ్రీవ)కేసులు,శాశ్వతంగా వలస వెళ్లిన వారు వంటి వర్గాలకు చెందిన ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ 90 శాతం దాటింది.

జులై 14లోగా ఎన్యూమరేషన్ పత్రం సమర్పించాలి

ఈ నాలుగు జిల్లాల్లో కూడా సుమారు 89 శాతం వరకు డిజిటైజేషన్ పూర్తయింది. మిగిలిన ప్రక్రియను వచ్చే రెండు రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఓటర్లు తమ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను జులై 14లోగా తప్పనిసరిగా బీఎల్‌వోలకు సమర్పించాలి. నిర్ణీత గడువులోపు పత్రాలు ఇవ్వని వారి పేర్లు జులై 21న ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండకపోవచ్చు.


దీంతో ఓటు హక్కుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంకా ఎన్యూమరేషన్ పత్రం సమర్పించని ఓటర్లు వెంటనే తమ పరిధిలోని బీఎల్‌వోను సంప్రదించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలు, తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా మ్యాపింగ్ చేసి ప్రక్రియ పూర్తి చేసేందుకు బీఎల్‌వోలు సహాయం చేస్తారు. ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలనుకునే వారు ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ లేదా జ్పుుI చీజుT యాప్ ద్వారా కూడా తమ ఎన్యూమరేషన్ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు