Homeజిల్లాలుఅనంతపురంగురజాడ అప్పారావు సేవలు చిరస్మరణీయం

గురజాడ అప్పారావు సేవలు చిరస్మరణీయం

- Advertisement -

సమాజ సంస్కరణకు ఆయన రచనలు మార్గదర్శకం : వక్తలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : గురజాడ అప్పారావు జయంతి వేడుకలను సోమవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అంటూ గురజాడ అందించిన సందేశాన్ని వక్తలు గుర్తుచేశారు. కన్యాశుల్కం వంటి గొప్ప రచనల ద్వారా సమాజంలోని రుగ్మతలను ఎత్తిచూపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు గురజాడ అప్పారావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఆయన రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో సతీష్ కుమార్, షేక్ మహమ్మద్ రఫీక్ మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, కరెంట్ గోపాల్, లాయర్ కృష్ణ, మండల కోఆర్డినేటర్ ప్రకాష్ గౌడ్, మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు అధికారులు గురజాడ అప్పారావుకు ఘనంగానే అర్పించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు