Homeఏఐఏడీఎంకేలో చీలిక

ఏఐఏడీఎంకేలో చీలిక

- Advertisement -

. టీవీకే ప్రభుత్వానికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు
. తిరుగుబాటు నాయకులతో విజయ్ భేటీ
. నేడు బలపరీక్ష
. తమిళనాడులో రాజకీయ సంచలనం

చెన్నై: తమిళనాడులో కొలువుదీరిన టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిన నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏఐఏడీఎంకే నిలువునా చీలిపోయింది. పార్టీ సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని వర్గం ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. షణ్ముగం నివాసానికి వెళ్లిన విజయ్…తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మెజారిటీ మార్క్ (118)కు కొద్ది దూరంలో నిలిచిన టీవీకే అధినేత విజయ్‌కు క్రమంగా వివిధ పార్టీల నుంచి మద్దతు లభించిన సంగతి విదితమే. ఇప్పటికే కాంగ్రెస్ (5), సీపీఐ(2), సీపీఎం (2), వీసీకే(2), ఐయÖఎంఎల్ (2)పార్టీలు విజయ్‌కు మద్దతుగా నిలిచాయి. టీవీకే సొంతంగా 108 స్థానాల్లో విజయం సాధించగా…విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందడంతో ఓటింగ్ పరంగా ఆ సంఖ్య 107కు తగ్గనుంది. అయితే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయÖఎంఎల్ మద్దతుతో ఈ సంఖ్య 120కి చేరనుండటంతో బలపరీక్షలో నెగ్గడంలో ఇబ్బందుల్లేవు. కాగా, బుధవారం బలపరీక్ష నేపథ్యంలో షణ్ముగం నాయకత్వంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవ్వడం సంచలనం రేపింది. తాజా భేటీలో భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, మంత్రి పదవుల కేటాయింపుపై విజయ్ చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామం విజయ్ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది. కాగా ఏఐఏడీఎంకేపై పట్టు కోల్పోయిన పళనిస్వామికి ఇప్పుడు కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఆయన అనుసరించిన మొండి వైఖరే పార్టీలో అసంతృప్తికి, తాజా చీలికకు ప్రధాన కారణమని సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. షణ్ముగం, వేలుమణి వంటి కీలక నేతలు విజయ్ వైపు మొగ్గు చూపడంతో అన్నాడీఎంకే ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది.
ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌ను బహిష్కరించిన ఏఎంఎంకే
ఇదిలా ఉండగా, తమిళనాడు ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌ను ఏఎంఎంకే నుంచి బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ వెల్లడించారు. అధికార టీవీకే పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపి, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు పార్టీలోని అన్ని పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు. అతడి విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు కామరాజ్ ద్రోహం చేశాడని విమర్శించారు. అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కామరాజ్ మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే ఏఎంఎంకే అధినేత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జ్యోతిష్యుడికి కీలక పదవి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఆస్థాన జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టారు. రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి రాజకీయ వ్యవ హారాలకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విజయ్ ముఖ్యమైన పనులను చేపట్టే ముం దు వెట్రివేల్‌ను సంప్రదిస్తారని తెలుస్తోంది. ఇటీవల మే 10న మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారం అనుకు న్నప్పటికీ వెట్రివేల్ సూచనతో ముహూర్తాన్ని ఉదయం 10 గంటలకు విజయ్ మార్చుకో వడం విశేషం. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో పార్టీల బ్యానర్లు పెట్టడాన్ని నిషేది óస్తున్నట్లు అధికార టీవీకే పార్టీ నిర్ణయిం చింది. ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని కార్యకర్తలను హెచ్చరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు