లక్షలాది మంది రోడ్లపైకి!
తెహ్రాన్: అమెరికా తీరుపై ఇరాన్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా… దుందుడుకు చర్యలు ఆగడం లేదంటూ లక్షలాది మంది ఇరాన్ పౌరులు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశం కోసం తాము కూడా ఆయుధాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా, ఇజ్రాయిల్ నాశనమవ్వాలంటూ నినాదాలు చేశారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్లో చేపట్టిన అతి పెద్ద ర్యాలీ ఇదే. దేశ ఐక్యతను ప్రతిబింబించేలా ప్రభుత్వ సూచన మేరకు భారీ సంఖ్యలో ఇరాన్ పౌరులు రోడ్ల మీదకు వచ్చారు. జాతీయ పతాకాన్ని చేతబట్టి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇరాన్ పోర్టులు దిగ్బంధనం సహా అనేక ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు. పరిమిత సైనిక శిక్షణ తీసుకొని, దేశ రక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత… సైనిక దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. వీళ్లంతా పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్‌కు అదనపు లేయర్‌గా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనున్నారు. అమెరికా చర్యల నేపథ్యంలో తన బలాన్ని చాటుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం ఈ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆరు లక్షల మందికిపైగా రిజిస్టర్ చేసుకోగా… దాదాపు 10 లక్షల మందికి పైనే పాల్గొన్నారని తెహ్రాన్ గార్డ్ చీఫ్ జనరల్ హసన్ వెల్లడించారు.
అమెరికాకు వ్యతిరేకంగాఇరాన్లో భారీ ర్యాలీ
- Advertisement -
RELATED ARTICLES


