ఐరాస బృందం నివేదిక
న్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా జరిపిన వైమానిక దాడులపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నియమించిన అంతర్జాతీయ నిజనిరÆరణ బృందం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన రెండు దాడుల్లో 178 మంది పౌరులు మరణించినట్లు పేర్కొంటూ… ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనకు దారితీసి ఉండొచ్చని తెలిపింది. ఈ ఘటనల్లో మహిళలు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో షజరెహ్ తయ్యెబెహ్ పాఠశాలపై జరిగిన దాడిని నిజనిరÆరణ బృందం ప్రధానంగా ప్రస్తావించింది. పాఠశాల స్పష్టంగా పౌర ప్రాంతంలో ఉన్నప్పటికీ అమెరికాకు చెందిన కనీసం ఒక టోమాహాక్ క్షిపణి అక్కడ పడినట్లు ఆధారాలు సూచిస్తున్నాయని తెలిపింది. ఈ దాడిలో 168 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా గతంలో వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని పేర్కొంది. అయితే ఈ ఘటనపై పూర్తి అధికారిక లెక్కలు ఇంకా వెలువడలేదు. అమెరికా ప్రభుత్వం కూడా పాఠశాలపై జరిగిన దాడికి ప్రత్యక్ష బాధ్యతను అధికారికంగా అంగీకరించలేదు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం.. ఈ దాడి విచక్షణారహిత దాడి అయి ఉండొచ్చని, అందువల్ల యుద్ధ నేరం జరిగి ఉండేందుకు సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని బృందం పేర్కొంది. అదే రోజు దక్షిణ ఇరాన్‌లోని లామెర్డ్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, సమీపంలోని నివాస ప్రాంతంపై మరో వైమానిక దాడి జరిగినట్లు బృందం తెలిపింది. ఈ ఘటనలో 22 మంది పౌరులు మరణించినట్లు పేర్కొంది. అయితే ఈ దాడికి అమెరికా బాధ్యతను అంగీకరించలేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా గతంలో లామెర్డ్ దాడికి తమ బలగాలు బాధ్యులు కాదని తెలిపింది. దీంతో ఈ దాడికి బాధ్యత ఎవరిపై ఉందన్న అంశం ఇంకా స్పష్టతకు రాలేదు.
ఇరాన్ ప్రభుత్వంపైనా ఆరోపణలు
మరోవైపు ఇరాన్ ప్రభుత్వ భద్రతా బలగాలపైనా నిజనిరÆరణ బృందం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ప్రజలపై పెద్ద ఎత్తున హింసకు పాల్పడినట్లు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు జరిగి ఉండొచ్చని పేర్కొంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ఒకవైపు… ఇరాన్ భద్రతా బలగాల చర్యలు మరోవైపు… ఈ రెండు పరిణామాల మధ్య సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని బృందం తెలిపింది.
అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడి ఉండొచ్చు
- Advertisement -
RELATED ARTICLES


