విశాలాంధ్ర – హైదరాబాద్: నగరంలోని ఏఎంఆర్, ఏఎంఆర్‌ఎల్ గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు రూ.6.5 కోట్ల ఆస్తులు, నగదు, సెక్యూరిటీలను ఫ్రీజ్ చేశారు. హైదరాబాద్, ఒడిశాలోని సంస్థ కార్యాలయాలతో పాటు గ్రూప్ ప్రమోటర్లు, అనుబంధ సంస్థలకు సంబంధించిన ప్రాంతాల్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. ఎస్‌ఆర్ఈఐ గ్రూప్లోన్ డిఫాల్ట్, మనీలాండరింగ్ కేసులో సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకు ఖాతాల్లోని రూ.1.50 కోట్లు, డీమ్యాట్, సెక్యూరిటీల్లో రూ.2.90 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు తెలిపారు. నగదు, బంగారు ఆభరణాలు కలిపి రూ.1.95 కోట్ల విలువ ఉంటుందని అధికారుల అంచనా.ఏఎంర్, ఏఎంఆర్‌ఎల్, ఏఆర్‌ఎస్‌ఎస్ గ్రూపులు ఎస్‌ఆర్ఈఐ సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. రుణాల డిఫాల్ట్‌తో పాటు నిధుల మళ్లింపు, రౌండ్-ట్రిప్పింగ్‌పై ఈడీ సందేహాలు వ్యక్తం చేసింది. రెండు గ్రూపులకు సంబంధించి రూ.1,111 కోట్ల రుణాలు బకాయి ఉన్నట్లు గుర్తించింది. సోదాల్లో లభించిన ఆధారాలు పరిశీలిస్తున్నామని ఈడీ ప్రకటించింది.
ఏఎంఆర్, ఏఎంఆర్‌ఎల్ గ్రూప్ ఆస్తుల ఫ్రీజ్
- Advertisement -
RELATED ARTICLES


