Homeతెలంగాణసహకారం అందించండి

సహకారం అందించండి

- Advertisement -

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ వినతి

విశాలాంధ్ర – హైదరాబాద్ : పీఎంఏవైజీ (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్) పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన గ్రామీణ కుటుంబాలు 11,56,915 మందికి ఇళ్లు మంజూరు చేయాలని గత జులైలో కేంద్రమంత్రికి దిల్లీలో వినతిపత్రం అందించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం మదాపూర్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎం కలిశారు. రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. వర్షాభావ నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. వ్యవసాయ రంగం పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్‌, వెజిటెబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహిం చాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని సీఎం కోరారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు