Homeఆంధ్రప్రదేశ్ఆముదాలగుంట తూము పనులపై రైతులు అసంతృప్తి

ఆముదాలగుంట తూము పనులపై రైతులు అసంతృప్తి

- Advertisement -

అంచనాల ప్రకారమే తూము పనులు పూర్తి చేయాలి
నాణ్యతలేని పనులతో ప్రభుత్వ ధనం వృథా చేయొద్దు
పాత తూముకు మెరుగులు కాదు.. కొత్తగా నిర్మించాలి
రూ.5 లక్షల పనులు పూర్తిస్థాయిలో జరగాలి
ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్

చిట్టమూరు – విశాలాంధ్ర : జలధార–జలహారతి పథకం కింద రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన ఆముదాలగుంట తూము మరమ్మతు పనులు నాణ్యత లేకుండా,నామమాత్రంగా సాగుతున్నాయని చిల్లమూరు పంచాయతీ కలుగుర్తిపాడు గ్రామ ఆయకట్టు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గుంట కట్టను తవ్వకుండా పాత దానికే మెరుగులు రుద్ది పాత తూముకు కేవలం నామమాత్రంగా రిటర్న్‌వాల్ నిర్మించి,పాత హెడ్‌వాల్‌కే అనుసంధానం చేయడంతో అసలు పనులు చేయకుండానే బిల్లులు పొందే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.రైతుల కథనం ప్రకారం,పాత తూమును పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉండగా,అందుకు విరుద్ధంగా అరకొర పనులతో సరిపెడుతున్నారని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు సాగుతుండటంతో భవిష్యత్తులో తూము మళ్లీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని పలుమార్లు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని రైతులు వాపోయారు.పనులు పూర్తిస్థాయిలో చేయిస్తే కాంట్రాక్టర్‌కు నష్టం వస్తుందని ఇరిగేషన్ అధికారి అబ్దుల్ గని వ్యాఖ్యానించారని కూడా ఆరోపించారు.ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనుల్లో ఇలాంటి నిర్లక్ష్యం తగదని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆముదాలగుంట తూము పనులను ఉన్నతాధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి,అంచనాల ప్రకారం నాణ్యతతో పూర్తి చేయించాలని, ప్రభుత్వ ధనం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.లేదంటే త్వరలో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు