అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పష్టత వచ్చింది. వీటిపై స్పందిస్తూ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఓ లేఖ విడుదల చేసింది. ఆ రోజు నిర్వహించనున్న ‘ఊరు-వాడ్ణ కార్యక్రమానికి.. తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది ఒక సామాజిక కార్యక్రమం మాత్రమేనని వెల్లడించింది. ‘‘జులై 18న జరగనున్న ఊరు-వాడ కార్యక్రమానికి ఎప్పుడో ప్రణాళికలు రూపొందించాం. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు. అసత్య ప్రచారాలను నమ్మొద్దు. ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని వల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారు్ణ్ణ అని ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆ లేఖలో పేర్కొంది. దీనిపై ఎన్టీఆర్ స్పందన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తమిళనాడులో విజయ్ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన బాటలోనే మరికొందరు హీరోలు వెళ్లనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. నటుడు అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కూడా బన్నీ కలిశారని కథనాలు వచ్చాయి. అయితే వీటిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు.


