Homeసాహిత్యంఆధునికత` హిందీ కవి ముక్తిబోధ్ కవిత

ఆధునికత` హిందీ కవి ముక్తిబోధ్ కవిత

- Advertisement -

హిందీమూలం: రాఖీరాయ్ హల్దర్, కోల్‌కతా
అనువాదకుడు: తక్కోలు మాచిరెడ్డి
సెల్: 7569693239

ఆధునికతను పారిశ్రామిక అభివృద్ధితో జత చేసి చూశారు పాశ్చాత్యులు. దీంతో వ్యక్తివాదం, ఒంటరితనం, జంకు, భయము వీటిని ఆధునికతా, లక్షణాలుగా వారు భావించారు. ముక్తిబోధ్ ఈ ఆధునికతను నిరసించారు. Å£Œ”ద్రమైన ఆలోచనలను ఢీకొనే సంఘర్షణాత్మక ఆధునికతను ఆయన తన కవితలో వ్యక్తం చేశారు. దీనికి తరక్కం ఆధారం. ‘ఏక్ శూన్యూ కే ప్రతి’ అనే కవితలో జీవతమనే అడుసులో దిగి వివేకమనే కమలాన్ని తుంచి తెచ్చి భగవంతునితో అంటాడు‘నాకు నీ అవసరంలేదు: బొత్తిగా లేదు.’ అని.
సంప్రదాయం నుంచి కొన్ని అభ్యుదయ అంశాలు తీసుకుంటాడు ముక్తిబోధ్. ‘ఏక్ అంత’ కథా’ అనే కవితలో సంప్రదాయమనే అడవి నుంచి ఎండిన కర్రలు తీసుకొని భవిష్యత్ తరం అనే బిడ్డ చేతిలోని తట్టలో వేస్తుంది. చారిత్రక అవగాహన అనే తట్టలో ఎండిన కర్రలు ప్రగతిశీల విలువలు` విప్లవాగ్నిని రగుల్కొలిపే మానవ విలువలు.
ముక్తిబోధ్ కాలంలో పెట్టుబడివాద దృష్టితో ప్రేరణ పొందిన ఆలోచనలకు సమర్థన లభించింది. భౌతికవాదంతో ప్రభావితమైన బౌద్ధికతకు: దీనిలో మానవీయ చేతన, సంపాదన లోపించాయి. అందుకే దీనిని ఆయన తిరస్కరించారు. ఆయన ఆలోచనా ధోరణి, సంవేదన, కల్పన, నైతికతతో మిళితమైనట్టిది.
పెట్టుబడివాద సమాజంలో మద్య వర్గపు బుద్ధిజీవులు కొల్లగొట్టబడే నిమ్న వర్గానికి నాయకత్వం వహించాలని కోరుకునేవాడు ముక్తిబోధ్. కాని, దీనికి బుద్ధిజీవుల అహం అడ్డు వస్తుంది అనేవారు. వీరి అహంభావం భగ్నం కావాలని కోరుకునే వాడు ముక్తిబోధ్. ‘లక్డీ కా బనా రావణ్’ అనే కవితలో అహంభావపు పెద్ద విగ్రహం కూలిపోయే స్థితికి రావడాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు ముక్తిబోధ్.
హిందీలోని ‘న ఈ కవిత’ లో వ్యక్తమైన విశ్వాసరాహిత్యంపై విజయం సాధించాలని గట్టిగా భావించేవాడు ఆయన.
శైలికి ప్రాధాన్యం ఇస్తూ సాహిత్యాన్ని కళగా చూడటాన్ని వ్యతిరేకించారు ముక్తిబోధ్.
రచనలోని మూడు దశలను పేర్కొంటూ ఆయన విశదీకరిస్తూ అంటాడు: ప్రథమ దశలో రచయిత బాహ్య అంశాల్ని ఆత్మగతం చేసుకుంటాడు. రెండవదశలో ఈ అంశాలు జీవిత విలువలతో కలగలిసి, రచయితను రచించేందుకు ప్రేరేపిస్తాయి. మూడవ దశలో పదాలు, పంక్తులతో సాహితీరూపం సంతరించుకుంటుంది.
సమాజ దురÝశకు కారణం ముఖ్యంగా సాహిత్యమూ, రాజకీయాల దృస్టి రాహిత్యం అని అంటాడు ఈ కవి.
కుటుంబంలోంచి సామంత విలువల్ని తరిమివేయనంత వరకు సమాజానికి మేలు జరగడు అని భావిస్తారు ముక్తిబోధ్.
సంవేదనకు, జ్ఞానానికీ మధ్య ఉండే సంబందాన్ని సూచిస్తూ, సంవేదనాత్మక జ్ఞానం, జ్ఞానాత్మక సంవేదన అనే భావాల్ని ప్రవేశపెడతారు ముక్తిబోధ్.
మార్క్స్ వాదానికి ఒక అంశం జోడిస్తూ మధ్య వర్గీయ బుద్ధిజీవుల భూమికను స్పష్టం చేస్తూ వారి పాత్రను పెద్దగా పేర్కొంటాడు ఆయన.
భారతీయ మేధావులపై పాశ్చాత్య ఆలోచనా ధోరణుల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, వ్యక్తివాదం, ఒంటరితనం, నిస్సహాయ మానవుడు లాంటి వాటిని వ్యతిరేకించారు ముక్తిబోధ్.
ఇక శిల్పానికి వస్తే, ఫ్యాంటసీని అనుభూతి కూతురు అంటాడు. ఫ్యాంటసీని అనుభూతితో మిళితం చేయడం ముక్తిబోధ్ ప్రత్యేకత, స్వీయ సంఘర్షణ, వ్యక్తిత్వ చేతనత్వం, సామాజిక నిబద్ధతతో కూడిన వస్తువును ఎంచుకోవడం ఆయన కవితా విశేషాలు.
మరి, ముక్తిబోధ్ ఆధునికత ప్రగతిశీల ఆధునికత అని గుర్తుంచుకోవాలి.
ప్రగతిశీల హిందీ పత్రిక ‘ఆలోచనా’ లో ప్రచురించిన వ్యాసానికి ఇది తెలుగు అనువాదం.
(తెలుగులో శ్రీశ్రీకి ఏ స్థానం ఉందో, హిందీలో ముక్తిబోధ్కు అదే స్థానం ఉంది.)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు