విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం డివిజన్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయడం జరిగింది అని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు లేని చోట పాఠశాల నుండి విద్యార్థులు ఉన్న పాఠశాలలకు పాత డివిజన్ స్థాయిలో దాదాపు 18 మండలాల నుండి 29 మంది ఉపాధ్యాయులను డివిజనల్ స్థాయిలో సర్దుబాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ సర్దుబాటు కార్యక్రమం శ్రీ సత్య సాయి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో 3మెన్ కమిటీ ద్వారా ఎంఈఓ గోపాల్ నాయక్ ధర్మవరం ఎంఈఓ జయచంద్ర కొత్తచెరువు, సాయినాథ్ సీనియర్ అసిస్టెంట్, చంద్ర శేఖర్ మొదలగు వారు పూర్తి చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, ముత్యాల ప్ప రామకృష్ణ నాయ క్ వివిధ మండల నుండి వచ్చిన ఉపాధ్యాయులు మొదలగు వారు పాల్గొన్నారు.
పూర్తి అయిన ఉపాధ్యాయుల సర్దుబాటు కార్యక్రమం.. ఎంఈఓ గోపాల్ నాయక్
- Advertisement -
RELATED ARTICLES


