విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. ఈ.బి. దేవి , ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ ఎస్. బి విష్ణుమూర్తి సూచనలు మేరకు మాస్ ప్రయివేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి . శ్రీరాములు మాట్లాడుతూ పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. పొగాకు, గుట్కా, సిగరెట్ వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని తెలిపారు. యువత, విద్యార్థులు పొగాకు బారిన పడకుండా ఉండాలని, “పొగాకు వద్దు – ఆరోగ్యం ముద్దు” అనే నినాదంతో ముందుకు సాగాలని కోరారు.
యువత పొగాకుకు దూరంగా ఉండి, సమాజంలో పొగాకు రహిత అవగాహనకు దూతలుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నర్సింగ్ స్టూడెంట్స్ పొగాకు వ్యతిరేక బ్యానర్ ప్రదర్శించి, ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్, డా. విష్ణుమూర్తి, డెమో ఆఫీసర్, నాగరాజు, లక్ష్మీనారాయణ, జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి.శ్రీరాములు , సిబ్బంది మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు
జాతీయ పొగాకు నియంత్రణ పై ఎం ఏ ఎస్ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు కు అవగాహన
- Advertisement -


