Homeజిల్లాలుశ్రీ సత్యసాయిలేపాక్షి లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేద్దాం

లేపాక్షి లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేద్దాం

- Advertisement -

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.వేమయ్య యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం/బత్తలపల్లి;; శ్రీ సత్య సాయి జిల్లాలోని లేపాక్షిలో ఆర్ జె హెచ్ ఫంక్షన్ హాల్ లో జూలై నెల27,28,29 మూడు రోజుల పాటు జరిగే జిల్లా సైద్ధాoతికతిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేద్దామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బత్తలపల్లి మండలంలో ఆర్కె ఫంక్షన్ హాల్ లో సిపిఐ బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వేమయ్య యాదవ్ మాట్లాడుతూ భూమికోసం భక్తి కోసం ఎందరో వీరుల ప్రాణత్యాగం వలన భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల పూర్తి చేసుకున్నదని గుర్తు చేశారు. 2014 ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం ధరల నియంత్రణ, నల్లధనం వెలికితీత,జనధన్ ఖాతాలు ఉన్నవారి ఖాతాలలో రూ.15 లక్షల డబ్బు జమ చేస్తామని దేశ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారన్నారు.శ్రమజీవుల స్వేదంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు కారు చౌకగా కట్టపెట్టడమే ధ్యేయంగా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కారు చౌకగా కట్టపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకానికి విబి జి రాంజీ పేరు చేర్చడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు సూపర్ సిక్స్ పథకాలలో చెప్పిన విధంగా పట్టణాలలో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.మహిళా శక్తి పేర మహిళలకు నెలకు రూ.1500 జమ చేస్తామన్న హామీ ఏమైందని,నిరుద్యోగ భృతి, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్,స్కాలర్ షిఫ్ ఆటకెక్కించడం సరి కాదని హితువు పలికారు.టిడ్కో ఇండ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అంద జేయాలని కోరారు. కరువు, వలసలు,ఆత్మహత్యల నిర్మూలన కోసం శాశ్వత పరిష్కారాలు నిర్వహించాలని కోరారు. అనంతరం శిక్షణా తరగతులకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ చేతి వృత్తుల సంఘము రాష్ట్ర అధ్యక్షలు జింకా చలపతి, నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు,చేనేత కర్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం కుళ్లాయప్ప, ధర్మవరం పట్టణ సహాయ రమణ, తాడిమర్రి మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, మహిళా సమైక్య రామిజా, లలితమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు