విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న నూతన ప్రసాదం తయారీ భవనాన్ని (ప్రసాదం పోటు దుర్గమ్మ ఆలయ ఈఓ వికె సీనా నాయక్), ఆలయ ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్ రమాదేవి కలిసి మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భవనంలో శరవేగంగా జరుగుతున్న పనులను, ముఖ్యంగా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న శాశ్వత ప్రసాదం విక్రయ కౌంటర్ల (Permanent Prasadam Sale Counters) నిర్మాణ పనులను వారు నిశితంగా పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈఓ సీనా నాయక్ మాట్లాడుతూ… దుర్గమ్మ భక్తులకు నిరంతరం నాణ్యమైన ప్రసాదాలను అందించడంతో పాటు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు ఈ నూతన భవనంలో శాశ్వత కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఈఈ ఎల్ రమాదేవి మరియు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆలయ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రసాదము విక్రయ కౌంటర్ల భవన నిర్మాణ పనులను పరిశీలించిన దుర్గగుడి ఈఓ సీనా నాయక్
- Advertisement -
RELATED ARTICLES


