Friday, May 3, 2024
Friday, May 3, 2024

బిజెపి ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయింది

సిపిఐ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

విశాలాంధ్ర – ధర్మవరం : బిజెపి ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ప్రభుత్వ సంస్థలన్నీ ఏకపక్షంగా అమ్మకానికి పెట్టి దోచిపెడుతున్నారని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగునంపదం- దేశాన్ని కాపాడుదాం!–సిపిఎం, సిపిఐ ఏర్పాటుచేసిన ప్రచార బేరి బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగ తొక్కి, పేదల ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ప్రభుత్వాలపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్షాలు పోరాటాలు కలుపుతూనే ఉంటాయని తెలిపారు. నేడు చేనేత పరిశ్రమ ఈ ప్రభుత్వాల వల్ల పూర్తిగా దెబ్బతిన్నదని, కుల మత బేధాలు లేకుండా అన్ని వర్గాల వారు చేనేత వృత్తిని ఎంచుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో చేనేత కార్మికులు ఉపవాసాలు ఉన్న రోజులు ఉన్నాయని, అప్పులు ఎక్కువై, ఎలా బ్రతకాలో తెలియక, అప్పులు తీర్చే లేక మనో వేదనతో, ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా బాధాకరమని తెలిపారు. ఇక గుడ్ మార్నింగ్ పేరిటలో నియోజకవర్గానికి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసింది ఏమీ లేదని, చేనేతలను, రైతులను ఆదుకున్న పాపాన పోలేదని వారు దుయ్యబట్టారు. ప్రతి కుటుంబానికి 15 లక్షలు వారి ఖాతాలో జమ చేస్తానని చెప్పిన వాగ్దానాలు ఏమయ్యాయి అని వారు ప్రశ్నించారు?. కేంద్రంలో మోడీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అప్పులు లక్షల్లో ఉన్నాయని, ఆ అప్పులు కూడా ప్రజల మీదే భారం పడుతుందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణము, అమరావతి రాజధాని నిర్మాణము, రైల్వే జోన్, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ హామీ ఏమైంది? అని వారు ప్రశ్నించారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, లౌకికవాద పరిరక్షణకు తూ ట్లు పొడుస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న మోడీ పాలనపై ప్రజలు కూడా విసుగు చెందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల చేనేత కార్మికులతో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాటమయ్య, ఏపీ చేనేత రాష్ట్ర కార్యదర్శి జింకా చలపతి, రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమణ కమతం కాటమయ్య, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కుళ్లాయప్ప రాజా పోతులయ్య విజయ్ కుమార్, చేనేత కార్మిక సంఘం నాయకులు వెంకటస్వామి, వెంకటరమణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img