విశాలాంధ్ర/హైదరాబాద్: భారతీయ నటుడు, యువత గుండెచప్పుడు విజయ్ దేవరకొండ, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ది దేవరకొండ బ్రాడ్కాస్ట్’ అనే పేరుతో సరికొత్త ప్రసార ఛానెల్‌ను ప్రారంభించి, తన అభిమానులు, అనుచరులకు మరో అడుగు చేరువయ్యారు. ఈ ఛానెల్ ద్వారా, విజయ్ రాబోయే తన సినిమాల గురించి మరికొంత ప్రత్యేకమైన కంటెంట్‌ను అభిమానులతో పంచుకోనున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని సరికొత్త ఫీచర్లలో బ్రాడ్కాస్ట్ ఛానల్స్ అనేవి ఒకటి కాగా, ఇది క్రమంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వారు తమ తాజా అప్డేట్లు, తెరవెనుక క్షణాలను పంచుకునేందుకు టెక్ట్స్, ఫోటో, వీడియో, వాయిస్ నోట్లను పంపించుకోవచ్చు. కాగా, అభిమానులు ఆయన స్టోరీ స్టిక్కర్ లేదా ప్రొఫైల్‌కు పిన్ చేసిన లింక్ ద్వారా మొబైల్లో విజయ్ బ్రాడ్కాస్ట్ ఛానెల్‌కి లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ఫాలోయర్‌గా ఉన్నవారికి ఛానెల్‌ని ప్రారంభించినప్పడు ఒక నోటిఫికేషన్ అందుతుంది.