Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

అక్టోబర్‌-నవంబర్‌లో థర్డ్‌వేవ్‌

సెకండ్‌ వేవ్‌ తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త థర్డ్‌వేవ్‌పై కీలక విషయాలు వెల్లడిరచారు. ఇప్పుడున్న కరోనా వేరియంట్ల కన్నా మరింత ప్రమాదకరమైన వేరియంట్‌ సెప్టెంబర్‌లో బయటపడితే దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్‌ హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే రాబోయే అక్టోబర్‌నవంబర్‌ మధ్య కాలంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ ఉధృతి కనిపిస్తుందని అయితే దాని తీవ్రత సెకండ్‌ వేవ్‌ కన్నా చాలా తక్కువగా ఉంటుందని అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.దేశంలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలను అంచనా వేసే ముగ్గురు సభ్యుల బృందంలో అగర్వాల్‌ ఒకరు. సెప్టెంబర్‌లో కొత్త వేరియంట్‌ ఏదీ రాకపోతే మాత్రం ఎలాంటి థర్డ్‌వేవ్‌ రాదని ఆయన తెలిపారు.ఒక వేళ థర్డ్‌వేవ్‌ వచ్చినట్లయితే దేశ వ్యాప్తంగా రోజుకు లక్ష పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. న్యూ మ్యూటెంట్‌ రాకున్నా, కొత్త వేరియంట్‌ కనిపించకున్నా యథాతథ స్థితి ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img