బెంగళూరు: వాలెంటైన్స్ డే సందర్భంగా సాంప్రదాయ అనుబంధాన్ని అనుసరించే బదులు, ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన బహుమతులలో బాదంను చేర్చాలని పోషకనిపుణులు కోరుతున్నారు. బాదంపప్పుల్లో జింక్, ఫోలేట్, ఐరన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్లతో సహా 15 పోషకాలతో నిండిన బాదం గింజలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర నియంత్రణను నిర్వహించడంలో సహాయపడతాయి. 15 పోషకాల మూలమైన బాదంను వాలంటైన్ గిఫ్ట్‌గా ఎంచుకోవడం మంచిదవుతుందని బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ అన్నారు. మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించడంలో బాదాములు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఢల్లీిలోని మాక్స్ హెల్త్‌కేర్‌లో డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ అన్నారు.