London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

బ్రహ్మోత్సవాల విజయవంతం పట్ల ఆలయ ఈవో వెంకటేసులు కృతజ్ఞతలు


విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వారి బ్రహ్మోత్సవాల వేడుకలు ఈనెల 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు 11 రోజులు పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారికి, బ్రహ్మోత్సవ వేడుకల్లో వివిధ వాహనాల ద్వారా ప్రజలకు దర్శనమిచ్చేందుకు సహకరించిన దాతలకు, రథోత్సవ కమిటీ అధ్యక్షులు దాశెట్టి సుబ్రహ్మణ్యం, సభ్యులకు, ఆలయ సిబ్బందికి పేరుపేరునా ఆలయ ఈవో వెంకటేశులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి సతి సమేతంగా సూర్య ప్రభ, చంద్రప్రభ, సర్వభూపాల, సింహ, కల్పవృక్ష, హనుమాన్, పల్లకి, శేష, గజా, బ్రహ్మ, దూలోత్సవం, అశ్వ, పుష్ప, హంస, గరుడ వాహనాలలో పట్టణ పురవీధులలో ఊరేగింపుగా వెళ్లడం జరిగిందన్నారు. దేవాలయంలో స్వామివారికి నూతన ఇత్తడి ఉత్సవ వాహనాలను విరాళంగా ఇచ్చిన పదిమంది దాతలు అందరికీ, ఉత్సవ విగ్రహాలకు పంచలోహాలతో కవచాలు పైకి బంగారు తొడుగు చేయించిన దాతకు, శ్రీవారి రథమునకు పుష్పాలంకరణ కొరకు దాతలు, అన్న ప్రసాదము కొరకు విరాళామందించిన బివిఆర్ శ్రీనివాసులు అండ్ బ్రదర్స్ వారికి, 20 కె.వి జనరేటర్ ను ఆలయానికి అందజేసిన దేశిడి హేమలత, దేవేందర్ రెడ్డి లకు, భక్తాదులను ఆకట్టుకునే విధంగా అన్నమయ్య సేవా మండలి వారిచే పంచమ సింగారి మేళం వాయిద్యం అందించిన శిష్య బృందానికి, రథోత్సవ కమిటీకి, అర్చకులు, దేవాలయ సిబ్బందికి పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img