మిచిగాన్: అమెరికాలోని మిచిగాన్‌లో కాల్పులు కలకలం రేపాయి. పిల్లల వాటర్ పార్క్ వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల పిల్లవాడితో సహా 10 మందికి గాయలయ్యాయి. పిల్లవాడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మిగతా వారు కోలుకుంటున్నట్లు చెప్పారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని, దుండగుడిని అదుపులోకి తీసుకున్నారని అధికారి చెప్పారు. బైక్‌పై వచ్చిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు వెల్లడిరచారు. 28 సార్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే కాల్పుల వెనుక కారణమేమిటో తెలియలేదన్నారు. ఇటీవల ఓహియో నైట్‌క్లబ్‌లో ఇద్దరు కాల్చివేతకు గురికాగా మరో ఇద్దరు గాయపడ్డారు.