-డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి
విశాలాంధ్ర-రాప్తాడు : రోజువారి వ్యాయామంలో భాగంగా యోగా చేయడం వల్ల శారీరక శ్రమ అలసట తగ్గుతుందని డ్రామా పీడీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాప్తాడు చెరువు వద్ద ఉపాధి కూలీలతో అధికారులు కలిసి యోగా (ధ్యానం) చేశారు. నిత్యజీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం, యోగ దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో చిన్నారి హాస్పిటల్ ఎండీ డాక్టర్ బి.హరి ప్రసాద్, ఎంపీడీఓ ఆర్.గీతావాణి, తహశీల్దార్ టి.సీతారాం, ఈఓఆర్డీ టి.నరసింహారెడ్డి, ఏపీఓ సావిత్రి, మండల స్థాయి
అధికారులు, యోగ సిబ్బంది, రెవెన్యూ, మండల పరిషత్, ఉపాధి పథకం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.