London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ప్రజల తీర్పు నుంచి పాఠాలు

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో 2024 సార్వత్రిక ఎన్నికలు అసాధారణమైనవిగా గుర్తుంటాయి. రాజ్యాంగంపై బీజేపీ దురాగతా లను, దాడిని ప్రతిఘటించి ‘ఇండియా’ కూటమి లౌకిక శక్తులు ఏకమయ్యాయి. నిరుద్యోగం, ధరలు పెరుగుదల వంటి సమస్యలు లేవనెత్తేందుకు, సమానత్వం, స్వేచ్ఛ, లౌకికత, సమాఖ్య వ్యవస్థ, సంక్షేమ రాజ్యం విలువలకు తలెత్తిన ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ కూటమి ప్రతినబూనింది. 2024లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందులో భాగస్వాములైన అందరికీ, రాజకీయ పార్టీలకు వేర్వేరు గుణపాఠాలు చెప్పాయి. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీతో దశాబ్దంపాటు సాగిన దుష్పరిపాలన మన ప్రజాస్వామ్యాన్ని కుదించేందుకు, మన రాజ్యాంగ విలువలను దెబ్బతీసేందుకు దారితీసింది. బీజేపీ పాలనలో ప్రజల కష్టాలు పెచ్చుపెరిగాయి. నిరుద్యోగం, అసమానత, ధరల పెరుగుదల ప్రజల జీవితాన్ని దుర్బరం చేశాయి.
మన రాజ్యాంగానికి, ఆర్థిక యాజమాన్యానికి ముప్పు, కేంద్ర ఏజన్సీల దుర్వినియోగం సందర్భంలో ఎన్నికలు జరిగాయి. దేశాన్ని హిందూ మతరాజ్యం దిశలో నడిపించటం వల్ల లౌకిక ప్రజాతంత్ర దేశం అనే అర్హత కూడా మసకబారింది. ఈ అన్ని కారణాలరీత్యా దేశ ప్రజలు నిర్ణయాత్మకంగా బీజేపీ, ప్రధానమంత్రి మెడలు వంచారు. ఆయన అనుసరించిన ద్వేషం, ప్రజల మధ్య విభజన, బెదిరింపులు, ఆశ్రిత పక్షపాతం రాజకీయాలను తిరస్కరించారు. లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం 63 సీట్లు తగ్గింది. అత్యంత కీలకమైన హిందీ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో బీజేపీ సీట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఏక్‌ అకెలా సబ్‌ పార్‌ బారీ’’ అంటూ ప్రధానమంత్రి మోదీ ఆవేశంగా ఛాతీ గుద్దుకోవటాన్ని ప్రజలు తిరస్కరించారు. టీడీపీ,జేడ ీ(యూ), శివసేన (షిండె), ఎల్‌జేపీ (ఆర్‌వి),జేడీఎస్‌, హెచ్‌ఎఎంఎస్‌, అప్నా దళ్‌ (ఎస్‌), ఎన్‌సీపీి (అజిత్‌పవార్‌) గ్రూపు వగైరాల తోడ్పాటుతో మోదీ విధిలేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
రెండోవైపున, ఇండియా కూటమి బీజేపీి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బలమైన ప్రత్యర్థిగా ఆవిర్భవించినప్పటికీ మెజారిటీ మార్క్‌ చేరుకోలేకపోయింది. రాజ్యాంగాన్ని సమర్థిస్తూ, కార్పొరేట్‌లకు అనుకూలంగా దేశ ఆర్థికవ్యవస్థను నడుపుతున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి బలంగా చేసిన ప్రచారం, బీజేపీి బలాన్ని ఉత్తరించడం ప్రజల తీర్పులో ప్రతిధ్వనించింది. బీజేపీ నిరంకుశ పెత్తందారీతనం నుంచి ప్రజా స్వామ్య రక్షణ కోసం 2024లో చేసిన ముఖ్యమైన పోరాటంలో గెలిచాం. అయితే మన ప్రజాస్వామ్య ఆరోగ్యం పునరుద్ధరించటం, మన సమాజ లౌకిక స్వభావాన్ని సజీవంగా ఉంచేందుకు అంతకన్నా సాగించే పెద్దయుద్ధం మన ముందుంది. ఈ వెలుగులో ఎన్నికల తీర్పును పరిశీలించాలి. నేను ఇంతకుముందు వ్యాసాల్లో రాసినట్లు, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవటం ఈ ఎన్నికల్లో ప్రధాన సమస్యగా బహుశా మొట్టమొదటిసారి ముందుకు వచ్చింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మెజారిటీ ఆధిపత్యవాదం వంటి ఇతర ప్రధానసమస్యలతోపాటు రాజ్యాంగాన్ని, అందులో పొందుపరిచిన సమానత్వం, సామాజిక న్యాయం, సమాఖ్యవ్యవస్థ (ఫెడరలిజం), బలహీన తరగతుల అభ్యున్నతికి గట్టి సానుకూల చర్యలు వంటి విలువలను బీజేపీ దాడి నుంచి రక్షించుకోవలసిన అవసరాన్ని ప్రజలు, ముఖ్యంగా బడుగు తరగతుల వారు బాగా అర్ధంచేసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీి ద్వేషపూరిత రాజకీయాలను భారతదేశ ప్రజలు బలంగా తిరస్కరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఓటుచేశారు. రెండు కారణాల రీత్యా దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. ఒకటి, రాజ్యాంగం రక్షణకై ప్రజలు ఓటు హక్కు వినియోగించటం మన దేశంలో రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామ్యం ఎంత లోతుకు చొచ్చుకుపోయిందో, బడుగు శ్రమజీవులు తమ హక్కులు, మానమర్యాదలు, ప్రయోజనాల పరిరక్షణకు రాజ్యాంగాన్ని ఎంతో తప్పనిసరి అవసరంగా గుర్తించారని నొక్కిచెబుతున్నది. రెండు, ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీలను మన రాజ్యాంగానికి, దాని విలువలకు వ్యతిరేకమైన శక్తిగా ప్రజలు స్పష్టంగా గుర్తించటం భారతదేశంలోని మితవాద శక్తుల రాజకీయ వైఖరిని బట్టబయలుచేసింది. ఆ వైఖరి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజానికి, అవకాశాలకు వ్యతిరేకం. ప్రజలు రాజ్యాంగ రక్షణకై వామపక్ష మొగ్గు కలిగిన మధ్యేవాదులను సామాజిక న్యాయం అనుకూల శక్తులను ఎంచుకున్నారు. ఇది మన రాజ్యాంగం పట్ల ప్రజల భావన ఎంత బలపడిరదో పుంఖానుపుంఖాలుగా చెబుతుంది. మన రాజ్యాంగానికి సంబంధించిన చర్చ, రాజకీయ వైఖరి మన రాజకీయ వ్యవస్థపై గాఢమైన ప్రభావం కలుగజేస్తుంది. ఎందుకంటే, రాజ్యాంగంలో పొందుపరిచినట్లు తాము పోరాడి సాధించుకున్న హక్కులను మితవాదులకు చెందిన నియంతృత్వ శక్తులు లాక్కోవటాన్ని అనుమతించబోమని ప్రజలు స్పష్టంగా చెప్పారు. అంతేగాక, అధికారిక పక్షం, మీడియా గడిచిన 10 సంవత్సరాల్లో ప్రతిపక్షాలపై దూకుడుగా దాడి చేశాయి. ప్రతిపక్షానికీ, ఇండియా కూటమిలో భాగస్వాములకు వ్యతిరేకంగా గత దశాబ్దం పాటు ఎంతో తప్పుడు ప్రచారం సాగించినప్పటికీ, ప్రజలు తమ జీవన సమస్యలకు ప్రాధాన్యత యిచ్చి లౌకిక ప్రజాతంత్ర పార్టీలను బలపరచాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం కల్పించిన ప్రజల నిత్యజీవిత సమస్యలను దృఢంగా ఎండగట్టటం ద్వారా ఆదరణకు పాత్రులయ్యారు.
ప్రతిపక్షాల పరోక్షంలో అనేక ముఖ్యమైన శాసనాలు ఆమోదింపజేసుకోవటం ద్వారా ప్రధానమంత్రి, బీజేపీి పార్లమెంటును అసంగతం చేయటానికి, నిరుపయోగమొనర్చటానికి గట్టిగా ప్రయత్నించాయి. పార్లమెంటరీ కమిటీలకు విలువలేకుండా చేశారు. బిల్లులను మనీ బిల్లులుగా వర్గీకరించి రాజ్యసభను నిరుపయోగం చేసే ప్రయత్నం చేశారు. చర్చ లేకుండా బిల్లులు ఆమోదించారు. అది సాధ్యం కానప్పుడు ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేసేవారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌లో రికార్డు నెలకొల్పింది. పార్లమెంటరీ వ్యవస్థను దురుపయోగం చేయటానికి, లోపలి నుంచి దాన్ని ఛిద్రం చేయటానికి బీజేపీ తన పార్లమెంటరీ బలాగాన్ని ఉపయోగించింది. ఇప్పుడు వామపక్షంతో పాటు ప్రతిపక్షం బలంగా ఉండటం, మోదీ సున్నితమైన సంకీర్ణానికి నాయకత్వం వహిస్తుండటం వల్ల పార్లమెంటు న్యాయబద్ధత పునరుద్ధరణ పొందవచ్చు. ఈ ఖ్యాతి అంతా ప్రతిపక్ష పార్టీలకు, పార్లమెంటుకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకు వాటి సంకల్పానికి చెందుతుంది. మన ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో పార్లమెంటు విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యతవుంది. బలమైన ప్రతిపక్షం పార్లమెంటరీ వ్యవస్థకు ఎంతో విలువైనది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో మరో ముఖ్యాంశం మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు ఏజన్సీలను బరితెగించి దుర్వినియోగపరచటం. భారత ఎన్నికల కమిషన్‌ సహా ముఖ్యమైన రాజ్యాంగబద్ధ సంస్థలు కార్యనిర్వాహకవర్గంతో రాజీపడటం. ప్రతిపక్షాన్ని బెదిరించి లొంగదీసుకోవటానికి ఈడీ, సీబీఐ, ఐటీి వంటి కేంద్ర ఏజన్సీలను బీజేపీి దుర్వినియోగం చేసింది. అనేక మంది రాజకీయ ప్రత్యర్థులను దర్యాప్తులతో వేధించింది, మరికొందిరిని జైళ్లలో తోసింది. కొన్ని రాజకీయ పార్టీలను బెదిరించి చీల్చారు. కొందరు వ్యక్తులను వేధించి తమ విధేయుల్ని చేసుకున్నారు. బీజేపీి ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకున్న నాయకులకు నిలయమైంది. అవినీతిపరులుగా బీజేపీ నిందించినవారే వారిలో చాలా మంది ఉన్నారు. అనేక మంది హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు చిన్నపాటి ఆరోపణలతో నిరంకుశ చట్టాల కింద జైళ్లలో నిర్భంధంలో కొనసాగుతున్నారు.
కేంద్ర ఏజన్సీలు, సంస్థలకు స్వాతంత్య్రం, స్వయం ప్రతిపత్తి, సవ్యంగా పనిచేయటాన్ని పునరుద్ధరించటం ద్వారా స్వేచ్ఛకు ప్రమాదాన్ని అదుపులో పెట్టాలి. ఈసీిఐ, ఆర్‌టీఐ, సీవీసీి వంటి ముఖ్యమైన సంస్థల, వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ బీజేపీి గతంలో అనేక నిబంధనలు తెచ్చింది. ప్రతిపక్షం పట్టువిడుపులేకుండా ఈ కుమ్మక్కును ఎండగట్టాలి. వాటి దుర్వినియోగాన్ని ఆపాలి. వాటి కార్యకలాపాల్లో కార్యనిర్వాహక వర్గం జోక్యాన్ని నివారించేందుకై వాటిని పార్లమెంటుకు జవాబుదారీ చేయాలి. మన ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా పనిచేయటానికి ముఖ్యమైన సంస్థలు సక్రమంగా పనిచేయటం అవసరం. పక్షపాతరహిత వ్యవస్థాగత స్వరూపానికి ఇండియా కూటమి నిబద్ధమై ఉంది.
ఇండియా కూటమి మెజారిటీ మార్క్‌ చేరుకోలేకపోయినప్పటికీ, బీజేపీ, మోదీ అహంకారాన్ని ఓడిరచటంలో, ఈ సారికి 400 సీట్లనే బుడగకు రంధ్రం పెట్టటంలో దాని శక్తిని నిరూపించుకుంది. అదే సమయంలో ఇది ఇండియా కూటమి భాగస్వాములు ఆత్మావలోకనం చేసుకుని, భవిష్యత్‌ వ్యూహాలు రూపొందించుకోవలసిన సమయం పరస్పర గౌరవం, సర్దుబాటుతత్వం, సైద్ధాంతిక పొందిక రానున్న అనేక పోరాటాలు ఇండియా కూటమి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ విభజనవాద సిద్ధాంతం చొరబాటును మన వ్యవస్థ నుంచి ఏరివేసేంతవరకు ఇది అవసరం.
వ్యవస్థలు రాజీపడినప్పటికీ బలమైన బీజేపీ పొగరుదించటం ఇండియా కూటమి తప్పక సంతోషించదగిందే. అయితే ఈ ఊపును నిలబెట్టుకోవటానికి ఆత్మవిమర్శనాపూర్వక విశ్లేషణ, భవిష్యత్‌ అవగాహన పట్ల స్పష్టత అవసరం. ఆశాభావం, న్యాయం, జీవనోపాధులు కలుగజేసే కూటమిగా ఇండియా అలయెన్స్‌ను దేశ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. భాగస్వామ్య పక్షాలు పరస్పర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని సంయుక్తంగా ప్రచారాందోళనలు, గౌరవప్రదమైన సర్దుబాటు ద్వారా సైద్ధాంతికంగా, రాజకీయంగా మరింత సన్నిహితం కావాలి. మితవాద శక్తులపై పోరాటం, ఓడిరచటంలో తమిళనాడు ఉత్తేజకరమైన నమూనాను నెలకొల్పింది. స్వాతంత్య్ర పోరాట వారసత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడవలసిన గొప్ప బాధ్యతను ప్రజలు మనకు అప్పగించారు. వామపక్షం పోరాడాలని, బలమైన శక్తిగా తనను తాను నిర్మించుకోవాలని, పార్లమెంటులోనే కాదు, రాష్ట్ర శాసనసభల్లో, స్థానిక సంస్థల్లో కూడా తగిన ప్రాతినిథ్యం పొందాలని ఆవిర్భవిస్తున్న పరిస్థితి డిమాండ్‌ చేస్తున్నది. మన రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, ప్రజాతంత్ర, సంక్షేమ, ఫెడరల్‌ స్వభావాన్ని తప్పక కాపాడుకోవాలి. రాజ్యాంగానుసారంగా జీవనోపాధులు కల్పించాలి. ప్రజలు ఉంచిన విశ్వాసం మేరకు పనిచేయటం, మన రాజ్యాంగ విలువలను క్రియాశీలంగా కాపాడు కోవటం, ప్రజల జీవితాలకు సకారాత్మకంగా ఐక్యంగా దోహదం చేయటం ఇప్పుడు ఇండియా కూటమి భాగస్వాములమైన మనపై ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img