London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఫ్రాన్సులో లెఫ్ట్‌ కూటమి గెలుపు అవకాశాలు

ఫ్రాన్సు జాతీయ అసెంబ్లీకి అతి త్వరలో జరగనున్న ఎన్నికల్లో 68 ఏళ్ల తర్వాత లెఫ్ట్‌ కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ జూన్‌ 30 న, జూలై 7 న జాతీయ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆకస్మికంగా ప్రకటించారు. జూన్‌ 9 న ఐరోపా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్సు దారుణంగా ఓటమి చెందడంతో మాక్రాన్‌ పై మేరకు నిర్ణయం తీసుకున్నారు. మితవాదులు గెలిచి ఫ్రాన్సులో అధికారం చేపట్టవచ్చునని ప్రధాన మీడియా సంస్థలు అంచనా వేస్తున్న సమయంలోనే వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పాటయ్యాయి. దీంతో ఫ్రాన్సులో రాజకీయాలు కొత్త మలుపు తీసుకోనున్నాయి. మితవాద పార్టీని వ్యతిరేకించే శక్తులన్ని ఏకమయ్యాయి. 1936 తర్వాత పాపులర్‌ ఫ్రంట్‌ రాజకీయాలు ప్రముఖంగా చెలాయించాయి. ఇప్పుడు వామపక్ష కూటమి దేశాన్ని పాలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకుల అంచనా. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, గ్రీన్సు, జీన్‌లిన్‌మెలెంఖాన్‌కు చెందిన ఫ్రాన్సు అన్‌బౌద్‌ పార్టీలు ఒక్కటయ్యాయి. మెరైన్‌ లీపెన్‌ పార్టీకి 31 శాతం ఓట్లు ఉన్నాయని ప్రాథమిక అంచనా ఉండగా, వామపక్ష కూటమి 3 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయని కూటమి ఏర్పాటైన కొద్దిరోజుల్లో అంచనాలు వచ్చాయి. మాక్రాన్‌ పార్టీ అతి తక్కువగా 14 శాతంతో మూడవ స్థానంలో ఉంది. ఆదివారం వెల్లడైన తాజా సర్వేలో లీ పెన్‌ నేతృత్వంలోని అతి మితవాద పార్టీ ఆర్‌ఎన్‌కు వామపక్ష గట్టిపోటీ నిస్తున్నట్లుగా వెల్లడైంది. లీ పారిసియన్‌ దినపత్రిక, రేడియో ఫ్రాన్స్‌ సంయుక్తంగా నిర్వహించిన ఇస్పోస్‌ సర్వేలో ఆర్‌ఎన్‌ పార్టీ 35.5శాతం ఓట్లతో ముందుంది. వామపక్ష కూటమి న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌) 29.5 శాతంతో ద్వితీయస్థానంలో ఉంది. అధ్యక్షుడు మాక్రాన్‌ నేతృత్వంలోని అధికార మధ్యేవాదకూటమి 19.5శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది.
ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు ఏమిటో ఆలోచించాలి. 2022 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాక్రాన్‌కు జీన్‌ మెలెంఖాన్‌ గట్టి పోటీ ఇచ్చారు. అనంతరం వామపక్షాల మధ్య గత రెండేళ్లుగా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. వామపక్షాలలో తీవ్ర నిరశ ఏర్పడిరది. మితవాదంలోనే ఫ్రాన్సు కూరుకుపోతుందని భావించాయి. అయితే రెండు వారాలుగా వూహించలేని మార్పు జరిగింది. లీపెన్‌ ఎన్నికల్లో గెలుస్తారని అంచనాలు వచ్చాయి. ఇదే సమయంలో వామపక్షాల మధ్య ఐక్యత ఏర్పడిరది. ప్రగతిశీల శక్తులన్నీ ఒకే బ్యానర్‌ కిందకు వచ్చాయి. మాక్రాన్‌తో ఉన్న మధ్యేవాద పార్టీలన్నీ బయటకు వచ్చి న్యూ పాపులర్‌ ఫ్రంట్‌కు మద్దతు పలికాయి. వాస్తవంగా మాక్రాన్‌ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు ప్రకటించవలసిన పనిలేదు. 2022 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టారు.
2027 వరకు అధికారంలో కొనసాగవచ్చు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 577 సీట్లుండగా మాక్రాన్‌కు 250 సీట్లున్నాయి. ముఖ్యమైన చట్టాల ఆమోదానికి తగినంత మంది తోడ్పాటు లేక ఇబ్బంది పడుతున్నారు. మెరైన్‌ లీపెన్‌ మితవాద పార్టీ తన పార్టీ పలుకుబడిని పెంచుకున్నాడు. మాక్రాన్‌ పార్టీ పలుకుబడి దిగజారింది. అధ్యక్షుడిగా మాక్రాన్‌ బలహీనుడయ్యాడు. ఈ నేపథ్యంలో జాతీయ అసెంబ్లీలో 88 సీట్ల బలంతో లీపెన్‌ ఉన్నారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో మాక్రాన్‌ పార్టీని ఓడిరచగలరని ప్రధాన మీడియా అంచనా వేసింది. గెలవడానికి 289 సీట్లు గెలుచుకోవాలి. మొదటి రౌండ్‌లో 12.5 శాతం ఓట్లు రానివాళ్లు పోటీ నుంచి తప్పుకున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లవుతుంది. మొదటి రౌండ్‌లో ఎవరూ గెలవకపోతే రెండవ రౌండ్‌ కీలకంగా ఉంటుంది. అయితే ఈ రౌండ్‌లో ఒక అభ్యర్థిని ఓడిరచాలన్న అవగాహన ఉంటుంది. మరో ఆసక్తి కలిగించే విషయం మాక్రాన్‌ 2027 వరకు అధ్యక్ష స్థానంలో కొనసాగవచ్చు. జులై 7 న జరిగే రెండో రౌండ్‌లో గెలిచిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.
అయినా మాక్రాన్‌ కూడా అదే ప్రభుత్వంతో కలిసి కొనసాగే అవకాశం ఉంటుంది. 2027 వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగుతానని ఇప్పటికే మాక్రాన్‌ ప్రకటించాడు. తమ పార్టీ ఓడిపోయినా అధ్యక్షుడిగా కొనసాగుతానని అన్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనాలున్నాయి. కమ్యూనిస్టు పార్టీ 50 సీట్లలో పోటీ చేయనున్నది. గత కొన్నేళ్లుగా కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కమ్యూనిస్టు పార్టీ శ్రద్ధ పెట్టి పని చేస్తున్నది. కూటమి గెలుపు కోసం అన్ని ట్రేడ్‌ యూనియన్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img