London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Tuesday, October 8, 2024
Tuesday, October 8, 2024

కోటంక సుబ్రమణ్యేశ్వర దేవాలయంలో జరిగిన చోరీ 5 రోజుల్లో చేధించిన పోలీసులు


విశాలాంధ్ర – అనంతపురం : నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు… 16.261 కిలోల వెండి ఆభరణాలు, తదితరాలు స్వాధీనం చేసుకున్న గార్లదిన్నె & సిసిఎస్ పోలీసులు-
జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాలతో ఈ వివరాలు మీడియాకు వెల్లడించిన అనంతపురం ఫ్రూరాల
ఈనెల 20 తేదీ రాత్రి… గార్లదిన్నె మండలం కోటంక గ్రామ సమీపములో వెలసిన శ్రీ గుంటి సుబ్రమణ్ణెశ్వర స్వామి దేవాలయం తాళాలు పగులగొట్టి స్వామి వారికి చెందిన సుమారు 16 కేజీల వెండి ఆభరణములు, 8 తులాల బంగారు ఆభరణములు మరియు రెండు హుండీలు పగులగొట్టి రూ.15000/- నగదు ను గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. అలాగే సీసీ కెమెరాలకు సంభందిచిన హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన మొత్తము సొత్తు విలువ రూ.16,55,000/- ఉంటుంది. ఈ చోరీ ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు.
1) సి. పవన్ కుమార్,. వయస్సు 29 సం ,, లు, తురకలపట్నం గ్రామం, రొద్దం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా
2) ఆవుల రాము @ యెరికల రాము వయస్సు 50 సం., ఎం ఎం ఎస్ మీదికి తండా, సి కె దిన్నె మండలం, కడప జిల్లా
3) వెంకట రమణ వయస్సు 47 సం.,కొత్త మదరమ్ గ్రామం, ఒంటిమిట్ట మండలం కడప జిల్లా

4) ఇ. శ్రీనివాసులు, వయస్సు 35 సం., బాల కృష్ణ నగర్, కడప టౌన్
ప్రస్తుతం అరెస్టయిన ముఖ్య నిందితుడైన సి.పవన్ కుమార్ కర్నాటక లోని కోలాల, కొరటగేరీ, పట్టణాయక్ హళ్లి, కడప జిల్లా లింగాల, సిద్దవటం పోలీసు స్టేషన్లలో దేవాలయాల దొంగతనాల కేసులలో నిందితుడిగా ఉన్నాడు.
ఆవుల రాముపై ప్రకాశం జిల్లా మర్రిపాడు పోలీసుస్టేషన్ లో గంజాయి కేసు ఉంది.
సుబ్రమణ్యేశ్వర స్వామి మూల విరాట్ కు ధరింపజేసే రూ. 13 లక్షల విలువ చేసే 16.261 కేజీల వెండి ఆభరణాలు, నాలుగు బంగారు తాళిబొట్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నగదు రూ.2500/-, నేరానికి ఉపయోగించిన ఐరన్ రాడ్, కట్టర్, కట్టింగ్ ప్లేయర్ మరియు క్యాటర్ బాల్ , సీసీ కేమరాల హార్డ్ డిస్క్లు స్వాధీనం
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని… వెంటనే ఛేదించాలని జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి పర్యవేక్షణలో శింగనమల సీఐ శ్రీధర్, సీసీస్ సీఐ ఇస్మాయిల్, గార్లదిన్నె ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దిగాయి.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు అహర్నిశలు శ్రమించి సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి దొంగతనము చేసిన నిందితులను బుదవారం ఉదయం అరెస్ట్ చేశారు.
చోరీ జరిగిన ఐదు రోజుల్లో కేసును ఛేదించి చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసి చోరి సొత్తును స్వాధీనం చేసుకొన్న సి.ఐ లు వి శ్రీధర్, ఇస్మాయిల్, ఎస్సై గౌస్ ఆధ్వర్యంలో హెచ్ సి ఫిరోజ్ సాహెబ్, ఎం .దివాకర్, హెచ్ సి ప్రసాద్, పీసీ దేవ్లా నాయక్, హెచ్ సి ఎస్ చంద్ర శేఖర్, శ్రీధర్ పాణి, మల్లికార్జున, శ్రీనివాసులు, పీస్ రంజిత్ కుమార్, బాలకృష్ణలను జిల్లా ఎస్పీ గౌతమి శాలి అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img