Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసి బస్సు సౌకర్యాలు మెరుగు పర్చాలి…

– విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణీకుల సమస్యలు పరిష్కరించాలి …
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లాలో పక్కా గ్రామీణ ప్రాంతమైన చోడవరం చుట్టుపక్కల గ్రామాలకు ఆర్టీసి బస్సు సౌకర్యాలు మెరుగు పర్చాలని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి, వర్గసభ్యులు డి.వెంకన్న డిమాండ్ చేసారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చోడవరంలో విద్య, వైద్యం, ఇతర పౌర, ప్రభుత్వ సేవలు కొరకు నిత్యం దేవరాపల్లి, చీడికాడ, వి.మాడుగుల, బుచ్చయ్యపేట, కె. కోటపాడు మండలాలు నుండి వందల నుండి వేల మంది నిత్యం ప్రయానిస్తుంటారని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యసీమకు ముఖ ద్వారమై,చుట్టుపక్కల సుమారు 40 పైగా గ్రామాలకు కేంద్రమైనటువంటి చోడవరం వెళ్ళాలంటే బస్సు సౌకర్యాలు లేవని, తక్షణమే మెరుగు పర్చాలని కోరారు. రెండు నియోజకవర్గాలకు కేంద్రమైన చోడవరంలో జిల్లా కోర్టు, ఉన్నత విధ్యాలయాలున్నాయని తెలిపారు. చోడవరం కేంధ్రంగా ఉన్న ఈ మండలాలు నుండి ప్రజలు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాడుగుల, చీడికాడ, బుచ్చయ్య పేట మండల కేంద్రాల్లో సైతం రాత్రి పూట బస్సు సౌకర్యం అరకొరగా ఉన్నాయని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు అయామంలో వున్న సమయంలోఎన్.డి.ఎ ప్రభుత్వం ఏర్పడిందని, దీనిపై ప్రజలు ఎన్నో అశలు పెట్టుకోని ఓట్లు వేయడం జరిందని తెలిపారు. చోడవరం మాడుగుల నియోజక వర్గాలు అత్యంత వెనుక బడిన నియోజక వర్గాలుగా ఉన్నాయని, వీటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. హస్టల్ తో కూడిన కాలేజీలు లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు పడుతూ, కార్పొరేట్ కాలేజీలకు డబ్బులు దారబోస్తూ, దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని తెలిపారు. దేవరాపల్లి లో హస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజి ని ఏర్పాటు చేయాలని, రెండు నియోకవర్గల్లో కస్తరిబా పాఠశాలల్లో సీట్లు శాతం పెంచాలని వసతి గృహాలకు అద్దెవనాలను, పక్కాగృహలు మంజూరు చేయాలని కోరారు. ఈరెండు నియోజకవర్గాల్లో అత్యధిక మంది గిరిజన గ్రామాలు ఉన్నాయని, వీరి కోసం ప్రత్యకంగా గిరిజన పాఠశాలలు లేకపోవడంతో గిరిజన విద్యార్దిని విద్యార్థులు చదువులకు దూర మౌతున్నారని తెలిపారు. దళిత గిరిజనులు అబివృద్దికి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఎర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. రవాణా సౌకర్యాలు లేని గ్రామాలు అబివృద్దికి నోచుకోలేదని తెలిపారు. బస్సులు సౌకర్యాలు లెని గ్రామాలకు వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని వెంకన్న డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img