విశాలాంధ్ర – ధర్మవరం : మనము చేసే ప్రతి పని స్టాటిస్ శిక్షలో భాగమే నని వాటిని శోధించి, విశ్లేషించే విధానమే స్టాటిస్టిక్స్ అని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి, డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, స్టాటిస్టిక్స్ అధ్యాపకుడు నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రేగాటిపల్లి రోడ్ శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో స్టాటిస్టిక్స్ గూర్చి మాట్లాడుతున్నారని అందుకు కారణం ప్రశాంత్ చంద్ర మహలోనో బిస్ అని తెలిపారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హర్షవర్ధన్ హరీష్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.