London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

డి.యస్.సి. పరీక్షలకు ఉచిత శిక్షణ

విశాలాంధ్ర – అనంతపురం : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విజయవాడ వారి ఆదేశాల మేరకు బి.సీ స్టడీ సర్కిల్, అనంతపురము నందు డి.యస్.సి. (యస్.జి.టి & స్కూల్ అసిస్టెంట్) పరీక్షల కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమం చేపడుతున్నట్లుబి.సి. స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బూ కొఠారి సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. టెట్ (టిచర్ ఏలిజిబిలిటి టెస్ట్) పరీక్షలో అర్హత సాదించిన వారికి ఉమ్మడి అనంతపురము జిల్లాకు చెందిన బి.సి., యస్.సి., యస్.టి. కులాలకు చెందిన అభ్యర్థుల నుండి డి.యస్.సి. (యస్.జి.టి & స్కూల్ అసిస్టెంట్) పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వికరించబడును. మొత్తము 200 మందికి శిక్షణ ఇవ్వబడును. టేట్ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడును. ఈ శిక్షణకు జూలై 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. జూలై 11వ తేదీ నుండి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణా కాలములో 75% హాజరు ఉన్న వారికీ స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ అందజేయబడుతుంది.
డి.యస్.సి. (యస్.జి.టి & స్కూల్ అసిస్టెంట్) టెట్ (టిచర్ ఏలిజిబిలిటి టెస్ట్) పరీక్షలో అర్హత సాదించిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు టెట్ మార్కుల జాబితా, టి.సి, డిగ్రీ మార్కు లిస్టులు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము (తల్లిదండ్రుల వార్షిక అదాయము రూ.1,00,000/- లోపు మాత్రమే), ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ మరియు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి ఆంధప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, జిల్లా కలెక్టరు వారి కార్యాలయము దగ్గర, పెన్నార్ భవన్ ప్రక్కన, అనంతపురము కార్యాలయము నందు మీ దరఖాస్తులు అందజేయవలెను.
మరిన్ని వివరాలకు నేరుగా కార్యాలయములో గాని, ఫోన్ నెంబరు 08554-275575 నందు సంప్రదించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img