London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పుట్టుకతో వచ్చు లోపాలపై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి మరియు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు వైద్యాధికారులకు మరియు స్టాఫ్ నర్స్ లకు ఒక రోజు పుట్టుకతో వచ్చు లోపాలపై వైద్య ఆరోగ్య శాఖ కాన్ఫరెన్స్ హాల్ నందు శిక్షణా కార్యక్రమం లాంఛనంగా నిర్వహణ అధికారి డాక్టర్ .జి. నారాయణస్వామి, చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీవిద్య సోమవారం ప్రారంభించారు.
ఈ శిక్షణలో ముఖ్యంగా పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు గుర్తించుట తల నుంచి పాదం వరకు చేసే పరీక్ష విధానము అప్పుడే పుట్టిన నవజాత శిశువు వయసు నుండి అంగన్వాడి మరియు కాలేజీ విద్యార్థుల వరకు వైద్య పరీక్షలు నిర్వహించి పుట్టుకతో వచ్చే లోపాలను పోషకాహార పెరుగుదల లోపాలు, జన్యుపరమైన లోపాలు, వైకల్యాలు, బరువు తక్కువ గల పిల్లలు ,నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, మెల్ల కన్ను,గ్రహణమొర్రి ,వంకర పాదాలు ,కంటి శుక్లాలు, వినికిడి లోకం ,గుండె సంబంధిత వ్యాధులు వివిధ రకాల అంటు వ్యాధులను గుర్తించి సత్వర చికిత్స అందించుట ముఖ్య లక్షణంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్స చేయలేని వారికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని సత్వర చికిత్స కేంద్రానికి నెంబర్ 99 ఓపి కేంద్రానికి రెఫర్ చేయాలని తెలియజేయడమైనది.
తదుపరి త్వరిత చికిత్స కేంద్రంలో స్క్రీనింగ్ నిర్వహించి తగువిధంగా చికిత్సలు ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ మొదలగు సర్వీసులను అందిస్తున్నాము.
తదుపరి శస్త్ర చికిత్సల అవసరమైన పిల్లలకి ఉచితంగా ఆపరేషన్లు చేపడుతుందన్నారు. వినికిడి లోపం, మెల్లకన్ను, కంటి రెటీనా, పెదవి, నోరు, గుండె పనితీరు లో లోపం వంటి పిల్లలకు దాదాపు 8 నుంచి10 లక్షల రూపాయల వరకు ఉచితంగా చికిత్స అందించడం జరిగిందన్నారు. వినికిడి లోపం గల పిల్లలకి వినికిడి పరికరాలు ఉచితంగా అందించబడుతుందన్నారు. డి ఈ ఐ సి నందు పై వ్యాధులకు ప్రత్యేకమైన తెరపిస్టులు చికిత్సలు మరియు రిహాబిలిటేషన్ అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్. మల్లీశ్వరి ,డి ఈ సి మేనేజర్ రజిత మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img