London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పండుగ వాతావరణ తలపించిన పింఛన్ పంపిణీ

. పట్టణ, రూరల్ పరిధిలలో కేక్ కటింగ్, పాలాభిషేకాలు చేసిన వైనం
. టిడిపి బిజెపి జనసేన సంయుక్తంగా కలసి పెన్షన్ పంపిణీ చేసిన వైనం
. సత్య కుమార్ యాదవ్కు ఘన స్వాగతం పలికిన ధర్మవరం ప్రజలు


విశాలాంధ్ర – ధర్మవరం : నూతన ప్రభుత్వం ఎన్ డి ఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో పెన్షన్ పంపిణీ పండుగ వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది. పట్టణ, రూరల్ పరిధిలో కేక్ కటింగ్ చేయుట, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం ను నిర్వహించడం కూడా జరిగింది. ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ధర్మవరం ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామంలో ప్రారంభమై ధర్మవరం మండలం నాగలూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డిలు పట్టణంలోని 35,36, 34, 33 వార్డులలో పింఛన్ పంపినేని నిర్వహించారు. ఆ తర్వాత ప్రజలతో మాట్లాడుట, వారి సమస్యలను అడిగి తెలుసుకునుట, పెన్షన్ దారులు యొక్క సంతోషాన్ని వారు పంచుకొనుట లాంటివి పండుగ వాతావరణముగా కొనసాగాయి. చివరగా శివానగర్లో సత్య కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పరిటాల రవీంద్ర, ఎన్టీఆర్ చిత్రపటాలకు స్వయంగా పాలాభిషేకమును నిర్వహించారు. అదేవిధంగా ఓ మహిళ తన పెన్షన్ను అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా సత్య కుమార్ యాదవ్ కి నాగదు అందజేశారు. అనంతరం ఆ మహిళకు సత్య కుమార్ యాదవ్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ అమరావతి రాజధానిని మనమే నిర్మించుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు రాజధాని లేకుండా పోయిందని వారు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మోసాలను వారు వివరించారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ను పంపిణీ చేశారు. అనంతరం సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం జరిగిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతాడని తెలిపారు. నియోజకవర్గంలో 48,022 మందికి పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలతో తాను ఎమ్మెల్యే మంత్రిని కావడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని వారి రుణాన్ని తప్పక తీర్చుకొని ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు. డయేరియా పై ఇప్పటికే అధికారులకు ఉత్తర్వులను పంపించడం జరిగిందని, ప్రతి వ్యక్తి తప్పకుండా ఆ వ్యాధిన బారిన పడకుండా రక్షించాల్సిన బాధ్యత వైద్యులదేనని వారు తెలిపారు. ఏ విషయమైనా ప్రజా ప్రభుత్వ దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్థికంగా దెబ్బతీయడం వల్ల నేడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే కొంతకాలం పడుతుందని తెలిపారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కార్యకర్తల భాగస్వామ్యంతో విజయవంతం కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు 35 రూపాయలతో ప్రారంభించిన ఈ పింఛన్ నేడు ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వేలకు పెంచడం అభినందనీయమని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అవ్వ తాత కళ్ళల్లో, పెన్షన్ దారుల్లో ఆనందాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, ఈ ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి మున్సిపల్ కమిషనర్, రామ్కుమార్, డిఎస్పి శ్రీనివాసులు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్, మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, చందా రాఘవ, పరిశే సుధాకర్, డోల రాజారెడ్డి జింక చంద్రశేఖర్ సాకే ఓబులేష్ గుండా పుల్లయ్య పురుషోత్తం గౌడ్ బోయ రవిచంద్ర పట్టణంలోని 40 వార్డుల ఇన్చార్జులు, టిడిపి బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img