London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలి

. రాష్ట్రాన్ని హెల్త్ కేర్ లో ముందంజలో నిలపాలి
. చిత్తశుద్ధితో డయేరియాని అరికట్టాలి
. ప్రజల్లో నమ్మకం కలిగించేలా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
. రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్

విశాలాంధ్ర – అనంతపురం : రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభించడంపై హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా.వెంకటేశ్వర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది, తదితరులతో రాష్ట్ర ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యో నారాయణో హరి అని మనమంతా చదువుకున్నామని, సమాజంలో డాక్టర్లకు మంచి గౌరవం ఉందని, భగవంతుడు అన్నిచోట్ల ఉండలేడు కాబట్టి తెల్ల కోటు వేసుకున్న డాక్టర్లను భూమి మీదకు పంపారని, అయితే వైద్యరంగంలో విలువలు తగ్గుతున్నాయని, అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. వైద్యులంతా ప్రజలకు అందించే సేవలు ఎంతో వెలకట్టలేనివని, కోవిడ్ లాంటి విషమ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి అందించిన సేవలు ఈ జాతి గుర్తుపెట్టుకుంటుందన్నారు. జాతీయస్థాయిలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రస్థాయిలో ఈరోజు అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగిందన్నారు. పిల్లలకు డయేరియా ప్రబలకుండా నివారించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు వారి సమస్యను చెప్పుకోలేరన్నారు. ఐదేళ్లలో ఒక్క మరణం జిల్లాలో సంభవించలేదని, ఇందుకు అభినందనలు తెలిపారు. డయేరియా నివారణకు స్టాండర్డ్ ఎస్ఓపీలు, ఐఈసి యాక్టివిటీలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆశ వర్కర్లు, ఎంఎల్ఓలు, వైద్య సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నిత్యం అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 3.7 కోట్ల జింక్ ట్యాబ్లెట్లు సరఫరా చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం వద్దకు ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లు వెళ్లాయా లేదా అనేది చూడాలన్నారు. నింగిలోకి రాకెట్ పంపించే రోజుల్లో మనం ఉన్నామని, చిన్నపాటి డయేరియాని అరికట్ట లేకపోతున్నామని, దానిని అరికట్టాలన్నారు. వెనుకబడిన రాష్ట్రాలతో కాకుండా తమిళనాడు, కేరళ లాంటి ముందుండే రాష్ట్రాలతో మన రాష్ట్రం ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటులో పోటీపడాలన్నారు. నిత్యం అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, డయేరియా ప్రబలకుండా అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిత్తశుద్ధితో డయేరియాని అరికట్టాలని, ప్రజల్లో నమ్మకం కలిగించేలా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సేవ చేయాలని, అందరి సహకారంతో రాష్ట్రాన్ని హెల్త్ కేర్ లో ముందంజలో నిలపాలని, ఇందుకు అధికారులంతా బాగా పనిచేయాలన్నారు.
ఈ సందర్భంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కింద అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అన్ని జిల్లాల్లో చేపడుతున్న యాక్టివిటీలను, డయేరియా క్యాంపెయిన్ స్ట్రాటజీని తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అతిసారా నియంత్రణ మాసోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో రెండు వారాల నుంచి సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించామని, రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. డయేరియా క్యాంపెయిన్ స్ట్రాటజీ, జూలై 1 నుంచి 14 వరకు ఐసిడిఎస్, ఆర్డబ్ల్యూఎస్, తాగునీరు మరియు శానిటేషన్, పట్టణ గ్రామీణ అభివృద్ధి మరియు విద్య, వైద్య శాఖ పరిధిలో చేపట్టే యాక్టివిటీల గురించి వివరించారు. ఆయా శాఖల అధికారుల భాగస్వామ్యంతో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా కమ్యూనిటీ యాక్టివిటీలను చేపడుతున్నామన్నారు. జిల్లాలో జింక్ ట్యాబ్లెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు బెడ్స్ మోతాదుకు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎక్కడైనా డయేరియా కేసు వచ్చిన వెంటనే చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల యాంటీ డేంగి నెల అని, ఇంటింటికి వెళ్లి డెంగి అనుమానితులను గుర్తిస్తున్నామని, పాజిటివ్ వస్తే వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలో డయేరియా అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పోస్టర్లను మంత్రి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, జిల్లా కలెక్టర్, తదితరులు ఆవిష్కరించారు. అనంతరం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. తదనంతరం మంత్రిని డిఎంహెచ్ఓ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్ టీం, తదితరులు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు రెవెన్యూ భవనం ఎదుట డయేరియాపై డప్పు కళాకారులు పాటల ద్వారా అవగాహన కల్పించగా, మంత్రి, జిల్లా కలెక్టర్ తదితరులు తిలకించారు. ఆ తర్వాత రెవెన్యూ భవనంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మలేరియా నివారణ, డెంగ్యూ నివారణ కార్యక్రమాలు, డ్రైడే ఫ్రైడే, అవగాహన కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి ఓబులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మణిక్యరావు, డిఎంహెచ్ఓ స్టాటిటికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఎన్సిడి నోడల్ ఆఫీసర్ నారాయణస్వామి, పిహెచ్సి, యూపీహెచ్సి, సిహెచ్సి మెడికల్ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img