London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

తాడి గ్రామానికి తాగునీరు సరఫరా

విశాలాంధ్ర – పరవాడ; నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో తాడి గ్రామానికి ఎట్టకేలకు ఉచిత తాగునీటిని అందించేందుకు రాంకీ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ మేరకు గ్రామంలో మంగళవారం ఆర్వో వాటర్‌ ట్యాంక్‌ ద్వారా తాగునీరు సరఫరాను అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ వి.అయ్యప్ప నాయుడు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఈ.ఈ ముకుందరావు ప్రారంభించారు. మాజీ జడ్పిటిసి మాదంశెట్టి నీలబాబు, మాజీ సర్పంచ్‌ బొడ్డపల్లి అప్పారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, ఫార్మా బల్క్‌ డ్రగ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జెట్టి సుబ్బారావు, రామేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో ఫిల్టర్‌ వాటర్‌ సరఫరాను ఏర్పాటు చేసారు. తాడి గ్రామాన్ని తరలించే దరకూ ప్రతి ఇంటికి రోజుకి 20 లీటర్లు చొప్పున ఉచితంగా ఫిల్టర్‌ వాటర్‌ను సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోమటి సూరిబాబు, పైలా కృష్ణ, సాలాపు రమణ, గనిరెడ్డి కనకరాజు, గుమ్మాల రాము, టి. శ్రీను, కోమటి అచ్చిబాబు, రామ్‌కి ఫౌండేషన్‌ ప్రతినిధి శ్రీకాంత్‌, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img