London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల కృషి మరింత అవసరం…

మున్సిపల్ చైర్మన్. కాచర్ల లక్ష్మి
విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల కృషి మరింత అవసరం ఉందని, ప్రతి విభాగానికి చెందిన అధికారి కౌన్సిలర్లకు సహాయ సహకారాలు అందించి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీసులో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అజెండాకు సంబంధించిన అంశాలపై చర్చించి, కౌన్సిలర్ ద్వారా తీర్మానాన్ని ఆమోదింప చేశారు. అనంతరం పట్టణంలోని వారు సమస్యలపై వైస్ చైర్మన్ జయరామిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మాసపల్లి సాయికుమార్, కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో అభివృద్ధి పనుల విషయంలో అధికారుల చెరువ మరింత ఉండాలని, అధికారులు కౌన్సిలర్లు సమన్వయముతోనే పట్టణ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. కలిసికట్టుగా అధికారులు, కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికై సహకరించాలని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులలో రజకులకు దోబీ ఘాట్ సమస్య అధికంగా ఉందని, త్వరితగతిన ధోబి గాట్లను ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. అదేవిధంగా రోడ్ల డివైడర్ లో మొక్కలు పూర్తిగా ఎండిపోవడం జరిగిందని, సకాలంలో నీరు పెట్టకపోవడంతో ప్రజల సొమ్ము వృధా అయిందని వాపోయారు. అదేవిధంగా నీటిని కూడా వృధా చేయడం మంచిది కాదని సూచించారు. డివైడర్ మధ్యలో గల ఎండిపోయిన చెట్లను తొలగించి, కొత్త మొక్కలను నాటాలని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత కృషి చేస్తే గాని పట్టణం అభివృద్ధి చెందదు అని తెలిపారు. పట్టణంలో ఏ పని జరిగిన కనీసం కౌన్సిలర్లకు సమాచారం అందించాలని తెలిపారు. అంతేకాకుండా వీధిలైట్ల సమస్య ఆనాటి నుండి నేటి వరకు అలాగే ఉండిపోయిందని, ఆ సమస్యను పరిష్కరించాలని వారు తెలిపారు. ప్రస్తుత నూతన ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేపట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లు జయరామ్ రెడ్డి, శంషాద్ బేగం, వార్డు కౌన్సిలర్లు,ఇంజనీరింగ్ ఈఈ .సత్యనారాయణ, ఇంజనీరింగ్ ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img