London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం…

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర- ధర్మవరం ;;అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి చేపట్టవలసిన కార్యచరణ ప్రణాళికలపై సంబంధిత జిల్లా, డివిజన్, మండల స్థాయి, అధికారులతో మంత్రివర్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఇంచార్జ్ ఆర్డిఓ వంశీకృష్ణ, మున్సిపాలిటీ కమిషనర్ రామ్ కుమార్, డిఇఓ మీనాక్షి దేవి,డిఎంహెచ్వో డాక్టర్ మంజువాణి, విద్యుత్ శాఖ ఎస్సీ ఈ ఎం సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఆర్ అండ్ బి అధికారి తదితరులు లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తదుపరి శాఖల వారీగా నియోజకవర్గంలో ఉన్న స్థితిగతులను మంత్రివర్యులకు, విద్య, వైద్య, నాడు నేడు, అమృత, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ శాఖ, త్రాగు నీటి సమస్యపై, పంచాయతీరాజ్ శాఖ, అధికారులు వారి వారి ప్రగతి వివరాలను వివరించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు 6000 మంది అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారని. నియోజకవర్గంలో పూర్తిగా పక్షవాతం నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అందుకు దీర్ఘ ప్రణాళికలు చేపట్టాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించడానికి ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నరు. అందుకు సంబంధిత అధికారులు ప్రణాళిక రూపంలో నివేదికలు నాకు అందజేయాలని ఆదేశించారు. త్వరలో శాఖల వారీగా సమీక్షించడం జరుగుతుందని ప్రతి శాఖలో ప్రజలకు ఏ విధంగా మీ శాఖలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారో, అవసరమైన నిధులు ఏమైనా కావాలో నివేదికలతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు, ఈనెల 9, 10 ,11 తేదీలలో మరల సంబంధిత శాఖ అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో, దీర్ఘకాలిక సంబంధించిన సమస్యలు, త్వరగా పరిష్కరించవలసిన సమస్యలను, మూడు నెలల్లో పరిష్కరించవలసిన సమస్యలను ఆయా శాఖల వారు గుర్తించి, నివేదికలు సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా నీటి సమస్య ఉండకూడదని తెలిపారు. నిర్దేశించిన సమస్యలు పరిష్కారం దిశగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి నియోజకవర్గ వచ్చిన నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వాటి వివరాలు సమగ్ర నివేదికలు రాబోయే సమీక్ష సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. బత్తలపల్లి మండలంలో డి చెర్లోపల్లి అనే గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చే 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు మంజూరు చేస్తే కేవలం ఆ గ్రామానికి 2693 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని వాపోయారు. అధికారులందరూ సామాజిక బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. మీ మీ శాఖలపై మంచి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నియోజకవర్గంలో మంచి పనులు చేయాలంటే మీ అభిప్రాయాలు తెలుసుకొని, మంచి పనులు చేయడానికి తాను ముందు వరుసలో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో గతంలో చెడు పనులు ఏవైనా ఉంటే నా దృష్టికి తీసుకొని రావాలని అధికారులను హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎల్లవేళలా నేను మరియు నా బృందం ఇక్కడ అందుబాటులో ఉంటామని, రెండు నెలల ఇక్కడి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు, ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగిందని. గ్రామాలలో డ్రైనేజీ సమస్యను, నీటి సమస్యను, విద్యుత్ సమస్యను, గృహ నిర్మాణ పనులను, ఇంటి పట్టాలను ఈ సమస్యలు పరిష్కరించడం మీరు కృషి చేయాలని అధికారులకు తెలియజేశారు. మంచి పని చేసినప్పుడే ప్రజలలో మంచి నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందజేయవలసిందిగా బాధ్యత మీ పైన ఉన్నదని తెలిపారు, కేంద్ర ప్రభుత్వం నుంచి, సివియర్ యాక్టివిటీస్ పైన కేంద్రంతో పోరాడి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. నియోజకవర్గంలో నేతన్నలు ఎక్కువగా ఉన్నారని వారిని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయడానికి నా వంతు కృషి చేస్తానని, అందుకు ప్రణాళికల సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ ఏ డి రమేష్ బాబు, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, ధర్మవరం అర్బన్, మండలాల తాహసిల్దార్లు, ఎంపీడీవోలు, విద్యుత్తు, ఇరిగేషన్, హౌసింగ్, ఉపాధి హామీ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img