London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

అతిశార వ్యాధిపై ప్రజలు తప్పక అవగాహన కల్పించుకోవాలి

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యు లు
విశాలాంధ్ర – ధర్మవరం : అతిశార వ్యాధిపై, తదుపరి సీజనల్ వ్యాధులపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కల్పించుకొని సమయానికి ప్రభుత్వ డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్య చికిత్సలు అందించుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చంద్రిక, శివానగర్ ఇంచార్జ్ డాక్టర్ శ్వేత, కొత్తపేట డాక్టర్ ప్రియాంక, సిద్దయ్య గుట్ట డాక్టర్ శ్వేత మాట్లాడుతూ అతిశార వ్యాధి అంటే ఏమిటి? దానిని ఎలా నివారించాలి? ఓ ఆర్ ఎస్ అండ్ జింక్ యొక్క ఉపయోగాలను మా సిబ్బంది ద్వారా ఇంటింటికి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు. బిడ్డకు ఒక రోజులో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు పలుచగా విరోచనం అయితే దానినే అతిసార వ్యాధి అని అంటారని తెలిపారు. అలాంటప్పుడు విటమిన్ ఏ సిరప్ త్రాగించాలని, స్వచ్ఛమైన తాగినీటిని తప్పక ఉపయోగించాలని తెలిపారు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుకోవాలని తెలిపారు. తల్లిపాలును బిడ్డకు మాత్రమే ఇవ్వడం శ్రేష్ఠకరమని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు రోటా వైరస్, తట్టుకు టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ఓఆర్ఎస్ ద్రావణం శరీరం కోల్పోయిన నీటిని, ఖనిజాలను తిరిగి నింపుతుందని తెలిపారు. అదేవిధంగా జింక్ రోగ నిరోధక వ్యవస్థను మరింతగా మెరుగుపరుస్తుందని తెలిపారు. జింక్ మోతాదులను రెండు నుండి 6 నెలల వరకు 20 మిల్లీ గ్రాముల అర్థమాత్ర, ఆరు నెలల పైన వయసు వారికి 20 మిల్లీగ్రాముల ఒక మాత్ర తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు. ప్రజలందరూ శుభ్రమైన సురక్షితమైన తాగునీటిని మాత్రమే ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎల్లప్పుడూ మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించాలని, మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లి పాలును బిడ్డకు త్రాగించాలని, అనుబంధ ఆహారం తగినంత పోషకాహారం ఇవ్వాలని, విటమిన్ ఏ సిరప్ ను త్రాగించాలని తెలిపారు. తల్లిపాలు త్రాగకపోవడం, లేదా తక్కువ తాగడం, తరచుగా పలుచని మలవిసర్జన, మలములో రక్తం రావడం, జ్వరంగా ఉంటే లేదా తాకితే చల్లగా అనిపించడం, అరచేతులు అరికాళ్ళు పసుపుపచ్చగా ఉంటే, ప్రతిదీ వాంతి చేసుకోవడం గా ఉంటే, ఆసక్తి లేకుండా ఉంటే లేదా అపస్మారక స్థితిలో ఉంటే, వేగంగా శ్వాస తీసుకోవడం శ్వాస లో ఇబ్బంది ఉంటే, మూర్చలు ఫిట్స్ లాంటివి కనపడితే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుని సంప్రదించి తగిన వైద్య చికిత్సను పొందినప్పుడే ఆరోగ్యవంతులు అవుతారని తెలిపారు. కావున తల్లులు మీ పిల్లలను అతిసారా వ్యాధి నుండి రక్షించుకొని సుఖవంతమైన జీవితమును గడపాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img