London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

మాజీ సైనికుల సంక్షేమానికి సత్వర చర్యలు జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్

విశాలాంధ్ర – అనంతపూర్ : జిల్లాలో ఉన్న మాజీ సైనికులు, సైనిక వితంతువులు, సర్వింగ్ సోల్జర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున సత్వర సేవలు అందించాలని, అలాగే మాజీ సైనికులు, వారి పిల్లల కోసం త్వరలో జాబ్ మేళా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం నాడు కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ డా . వినోద్ కుమార్ అధ్యక్షతన దాదాపు ఐదారు సంవత్సరాల గ్యాప్ తర్వాత అనంతపురము జిల్లా సైనిక్ బోర్డ్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆమోదించిన ఎజెండా పాయింట్స్ ను, జిల్లా సైనిక్ బోర్డు మీటింగ్ ముఖ్య ఉద్దేశాన్ని అనంతపురము , సత్యసాయి జిల్లాల సైనిక సంక్షేమ అధికారి మరియు జిల్లా సైనిక్ బోర్డు కార్యదర్శి పి. తిమ్మప్ప బోర్డు చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ కు, బోర్డు సభ్యులు మేఘా స్వరూప్, ఇతర సభ్యులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో మనందరి రక్షణ కోసం అహర్నిశలు కఠోర శ్రమతో సైనిక విధులు నిరవహిస్తూ పదవీ విరమణ చేసిన మాజీ సైనికులు, ప్రాణ త్యాగం చేసిన వీర సైనికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, సైనిక వితంతువుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న 5 ఎకరాల అస్సైన్డ్ భూముల కేటాయింపు , గన్ లైసెన్సుల జారీ, కేంద్రీయ సైనిక్ బోర్డ్, రాజ్య సైనిక్ బోర్డుల తరఫున, కేంద్ర రక్షణ శాఖ, ఆయా త్రివిధ దళాల రెజిమెంట్ల తరఫున అందిస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ రకాల గ్రాంట్లు, పెన్షన్ , గుర్తుంపు కార్డుల జారీ, ఆర్మీ క్యాంటీన్ కార్డులు, ఈసీహెచ్ఎస్ ఆరోగ్య సేవలు తదితర సంక్షేమ పథకాల లబ్ధి, సేవలను జాప్యం లేకుండా సత్వరమే అందించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సైనిక్ బోర్డు ఛైర్మన్ డా. వినోద్ కుమార్ ఆయా శాఖల జిల్లా అనంతపురము మునిసిపల్ కమీషనర్ మేఘా స్వరూప్, ఇతర మునిసిపల్ కమీషనర్లను , డిపిఓ ను ఆదేశించారు.
జిల్లా సైనిక్ బోర్డు సమావేశంలో అనంతపురము మునిసిపల్ కమీషనర్ మేఘా స్వరూప్, బోర్డు సెక్రటరీ పి. తిమ్మప్ప, బోర్డు వైస్ ఛైర్మన్కె ప్టెన్ వి.నారాయణప్ప , బోర్డు సభ్యులు డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కల్యాణి, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం నాగరాజ రావు, డిఆర్డియే పిడి ఈశ్వరయ్య, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఎల్ డి ఎం నర్సింగ్ రావు, నాన్-అఫీషియల్ సభ్యులైన మాజీ సైనికులు బలరామ రావు, బి.ఆంజనేయులు, ఎం.మురళీ మాధవ్, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి.శేష ఆంజనేయులు , ఆర్ డి టి ఏకాలజీ సెంటర్ సీ ఓ ఓ జె. మురళీ కృష్ణ, రమణ క్యాటరర్స్కే వీ రమణ , మాజీ సైనికులు శేషగిరి రావు, కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ గిరీష్, బాబా, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img