London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

బలహీనపడుతున్న మీడియా స్వేచ్ఛ

నంటూ బెనర్జీ

ప్రపంచవ్యాప్తంగా పత్రికలు, మీడియా స్వేచ్ఛ రోజురోజుకీ బలహీన పడుతోంది. కొన్నిదేశాల్లో ప్రభుత్వాలు జర్నలిస్టులపై నిరంకుశంగా వ్యవహరిస్తూ, తమ రహస్యాలను బైటపెట్టినందుకు జర్నలిస్టులపై నిరంకుశంగా వ్యవహరిస్తూ చంపివేసిన ఘటనలున్నాయి. 30దేశాల్లో 360 మంది జర్నలిస్టులు పాలకుల రహస్యాలను కనిపెట్టినందుకుగాను అరెస్టుచేసి జైళ్లలో నిర్బంధించిన కేసులున్నాయి. ఇలాంటి వందల కేసుల్లో వికిలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియస్‌ అసాంజె కేసు అత్యంత హృదయ విదారకరమైంది. అమెరికా నిఘాచట్టాన్ని ఉల్లంఘించారని కేసు బనాయించి జైలులో పెట్టారు. అసాంజే స్వేచ్ఛ పొందడానికి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంధోని అల్బన్సె సహాయం చేశారు. అమెరికా ఏ దేశంలో ఎన్ని అకృత్యాలు నిర్వహించి, అమెరికా నిఘాసంస్థ ఎన్ని ప్రభుత్వాలను కూల్చివేసిందని, ఇంకా అనేక విషయాలను బైటపెట్టి తమను అప్రతిష్టపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేసి అమెరికా అసాంజెను కష్టాలపాలు చేసింది. ఆస్ట్రేలియా దౌత్యపరంగా సహకరించి అమెరికాతో చర్చలు జరిపిన తర్వాత ఎట్టకేలకు అసాంజెకు విముక్తి లభించింది. తాను తప్పు చేసినట్లు అసాంజె అంగీకరించడం వల్లనే స్వేచ్ఛ లభించింది. 14ఏళ్లపాటు అసాంజె న్యాయపోరాటం చేశారు. ఆస్ట్రేలియా సంఫీుభావం ఆయనకు లభించింది. అసాంజె జన్మించిన దేశం ఆస్ట్రేలియా. అంతిమంగా అమెరికా అసాంజెను శిక్షనుంచి మినహాయించాలని క్షమాబిక్ష పెట్టింది. అమెరికా సైనిక పత్రాలను, ఇరాక్‌, అఫ్ఘానిస్థాన్‌లపై అమెరికా చేసిన దాడులకు సంబంధించిన వీడియోలను అసాంజె బైటపెట్టారు. ఏ దేశంలో ఎన్ని ఘోరాలకు, నేరాలకు అమెరికా పాల్పడిన అంశంపై ‘హిట్‌మాన్‌’ పేరుతో పుస్తకం రాసి అమెరికా నిఘా విభాగానికి చెందిన రచయిత వారి గుట్టంతా బైటపెట్టారు. అమెరికా అఫ్ఘానిస్థాన్‌పై దాడిచేసి అనేకమందిని కస్టడీలోకి తీసుకుని అమెరికాలో ఖైదు విధించింది. మానవ హక్కులను ఉల్లంఘించి పౌరులను చంపి వేశారు. ప్రభుత్వాలే కాకుండా అనేకమంది ఉన్నత స్థానాల్లోఉన్న నాయకుడు చేసిన అక్రమాలనుసైతం బైటపెట్టారు. ప్రత్యేక సమాచారం పేరుతో రహస్యంగా దాచిన చర్యలను అసాంజె తన సామర్ధ్యంతో వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన బ్రిటన్‌లో అత్యున్నత భద్రత కలిగిన జైలులో 5ఏళ్లకుపైగా శిక్ష అనుభవించారు. లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఏడేళ్లపాటు ఆశ్రయం పొందారు. ఆ తరువాత ఆయనపై అత్యాచారం కేసు నమోదైంది. అదే కాకుండా, పద్దెనిమిది క్రిమినల్‌ కేసులను కూడా ఆయనపై మోపారు. ఆయన ఇలాగే కొనసాగినట్లయితే అమెరికా జైలులో జీవితాంతం ఉండవలసి వచ్చేది. అఫ్ఘానిస్థాన్‌, ఇరాక్‌లపై అమెరికా సైన్యం దాడులకు సంబంధించి సైనిక రహస్యపత్రాలను కూడా అసాంజె బైటపెట్టారు. ప్రపంచంలో బహుశ: ఇలాంటి సాహస చర్యలను ఏ జర్నలిస్టు నిర్వహించలేదు. తప్పులు చేసినవారి తప్పులను బైటపెట్టినందుకే వికిలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజెను ఎనలేని కష్టాలకు గురిచేశారు. చివరకు తన తప్పులేకపోయినా తప్పు చేసినట్లు కోర్టులో అంగీకరించడంతో స్వేచ్ఛ కల్పించారు. ఆయన ఆస్ట్రేలియాకు చేరుకుని కుటుంబంతో కలిసి ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చారు. కుటుంబసభ్యులు కూడా దీర్ఘకాలం తరువాత ఇంటికి వచ్చిన అసాంజేను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ వివాన్‌ జర్షింకోవిచ్‌ని పదిహేను నెలలుగా మాస్కో జైలులో నిర్బంధించడంపై పశ్చిమదేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అమెరికాకు 1500 కిలోమీటర్ల దూరంలో ఎక్టేరిన్‌బర్గ్‌లో విచారణ జరుపుతున్నారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కోసం వార్తలు అందించే వివాన్‌పైన కూడా నిఘాచట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ జైలులో పెట్టారు. అలాగే వాల్‌స్ట్రీట్‌కు చెందిన పాకిస్తాన్‌లో పనిచేసిన విలేకరి డేనియల్‌ పెరల్‌ను పోలీసులు అపహరించు కునిపోయి చంపివేశారు. వివాన్‌ పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటున్న ముబారక్‌ అలీ జిలానీని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లారు. ఇదే విధంగా సౌదీ జర్నలిస్టు జమాల్‌ అహ్మద్‌ ఖషోగ్గి కూడా హింసకు గురయ్యారు. ఆయన అల్‌ అరబ్‌ న్యూస్‌ చానల్‌కు ప్రధాన ఎడిటర్‌గా చేశారు. ‘మిడిల్‌ ఈస్ట్‌ ఐ’ లో క్రమం తప్పకుండా ఒక కాలమ్‌ రాసేవారు. వాషింగ్టన్‌ పోస్టుకు ఆయన విలేకరిగా పనిచేశారు. అయనను ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో సౌదీ ప్రభుత్వ ఏజంట్లు చంపివేశారని ఆరోపణలున్నాయి. సౌదీ రాచరిక కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఖషోగ్గి వాషింగ్టన్‌ పోస్టుకు నెలవారీ రాసే వ్యాసంలో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ దేశ పాలకుడిగా వ్యవహరించారు. ఎక్కువ సంవత్సరాలు గడవకుండానే ఖతార్‌ నుంచి ఇంగ్లీషు ఛానల్‌ అల్‌ జజీరాకు ఖతార్‌లో ఉంటూ ముగ్గురు జర్నలిస్టులు పనిచేశారు. వారు ఆస్ట్రేలియన్‌ పీటర్‌ గ్రస్టి, కెనడియన్‌ మహమ్మద్‌ ఫామి, ఈజిప్టుకు చెందిన బహర్‌ మొహమ్మద్‌లను ఈజిప్టు భద్రతాదళాలు కస్ట్టడీలోకి తీసుకుని దేశ భద్రతను దెబ్బతీసారని కేసు నమోదుచేసి జైలులో పెట్టారు. వారిని నేరస్థులుగా పరిగణించి ఏడు నుంచి పదేళ్లపాటు జైలుశిక్ష విధించారు. అయితే అధ్యక్షుడు వారిని మన్నించి క్షమాబిక్ష పెట్టారు. జర్నలిస్టులను కాపాడేందుకు న్యూయార్క్‌లో ఒక కమిటీ ఏర్పడిరది. అది లాభరహిత సంస్థ. ప్రపంచవ్యాప్తంగా విలేకరుల స్వేచ్ఛను మరింత పెంపొందిం చేందుకు పనిచేస్తున్నది. గత సంవత్సరం వరకు 30దేశాల్లో 363మంది జర్నలిస్టులను నిర్బంధించింది. ఎక్కువమంది జర్నలిస్టులను ఇరాన్‌, చైనా, మియన్మార్‌ దేశాలలో గత సంవత్సరం సిపీజే నివేదిక ప్రకారం, ఇండియాలో ఏడుగురు జర్నలిస్టులను నిర్బంధించారు. వీరిని మూడేళ్లపాటు జైలులో నిర్బంధంలో ఉంచారు. వీరిలో నలుగురిపై క్రూరమైన చట్టాన్ని మోపారు. జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వ రక్షణా చట్టం క్రింద అరెస్టు చేశారు. నిర్బంధించిన వారిలో కశ్మీర్‌నుంచి పనిచేసే ఆసిఫ్‌సుల్తాన్‌, అలాగే కశ్మీర్‌కు చెందిన సజాద్‌ గుల్‌, ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు రూపేష్‌ కుమార్‌ సింగ్‌, గౌతమ్‌ నవల్‌ఖా, మజీద్‌ హైదరీ, ఇర్ఫాన్‌ మెహరాజ్‌, ప్రబీర్‌ పురకాయస్థ(న్యూస్‌క్లిక్‌) ఉన్నారు. ఇంఫాల్‌ నుండి ప్రచురితమవుతున్న హైయన్‌ లాన్‌పావ్‌ పత్రికకు పనిచేస్తున్న జర్నలిస్టును ఈ సంవత్సరం జనవరి 5వ తేదీన అరెస్టు చేశారు. మతాలు, జాతుల మధ్య వ్యతిరేకతను రెచ్చగొడు తున్నారంటూ జర్నలిస్టులను అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టుల గురించి ఎక్కువ ప్రాంతాలకు తెలియదు. అలాగే ప్రబీర్‌ పురకాయస్థ అరెస్టు కూడా ఎక్కడా అంతగా తెలియదు. ఉన్నతస్థాయి విద్యార్హత కలిగిన టెలికాం ఇంజినీరు, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న నవల్‌ఖా దిల్లీ సైన్స్‌ ఫోరం వ్యవస్థాపక సభ్యుడు. అయనను అరెస్టుచేసి తిహార్‌ జైలులో 2023 నవంబరు 2వతేదీన పెట్టారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రబీర్‌ పురకాయస్థ అరెస్టు చెల్లదని తీర్పునిచ్చింది. అంతక్రితం దిల్లీ లోయర్‌కోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. ఈ కోర్టు విధించిన శిక్ష మూలంగానే మొదట ఆయన జైలుకు వెళ్లారు. 74ఏళ్ల జర్నలిస్టును అక్రమ కార్యాకలాపాల (నిరోధక) చట్టం క్రింద అరెస్టు చేశారు. చైనాకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు గాను విదేశాల నుంచి ఆయనకు నిధులు లభిస్తున్నాయన్న ఆరోపణలపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. పైగా చార్జిషీటులో వార్తల సిండికేట్‌ల కుంభకోణం అని పేర్కొన్నారు. అంతేకాదు, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ ఇంకా ఇతర కాలమిస్టులకు పురకాయస్థ నిధులు అందచేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్ని మీడియా వేదికలు`ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌, ప్రచార సాధనాలు ప్రజా ప్రయోజనంకోసం తమ ఆలోచనలను వెలుగులోకి తెచ్చేందుకు వారికి అన్ని హక్కులు ఉంటాయి. భారత ప్రభుత్వం అధికారిక రహస్యాల చట్టాన్ని అణచివేసే చట్టం, హక్కుగల సమాచార చట్టం (2005) మధ్య సమతుల్యత ఉండేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img