London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

అల్లూరి సీతారామరాజు కొనసాగించిన విప్లవ పోరాటం… తెలుగు జాతి చరిత్రలో క్రియాశీలక ఘట్టం

— జిల్లా ఎస్పీ గౌతమిసాలి
విశాలాంధ్ర -అనంతపురం : స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్ర లో ఒక మహోజ్వల శక్తి అన్నారు. బ్రిటిష్ వారి గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన విప్లవ జ్యోతి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించాడన్నారు. దేశభక్తి స్ఫూర్తి, భారతీయ జాతీయవాదం జ్వాలలను రేకెత్తించిందన్నారు. దేశంలో బ్రిటిష్ పాలకుల దోపిడీ, దురాగతాలు, దమనకాండలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టేందుకు అనేకమందిని ప్రేరేపించిందని గుర్తుచేశారు. సీతారామరాజు సాగించిన సాయుధ పోరాటం తెలుగు జాతి చరిత్రలో గొప్ప ఘట్టంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, అనంతపురం డీఎస్పీ టి.వి.వి ప్రతాప్, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, సి.ఐ లు దేవానంద్, సుబ్రమణ్యం, ఆర్ ఐ లు రాముడు, మధు, ఆర్ ఎస్ ఐ లు వెంకటేశ్వర్లు, స్వామినాయక్, గోపాల్, పోలీస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ ఎస్ ఐ జాఫర్, జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, ఎస్పీ సి.సి ఆంజనేయ ప్రసాద్, జిల్లా పోలీస్ మినీస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపి, బి. సూపరింటెండెంట్ ప్రసాద్ మరియు జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img