London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్ విజయవంతం

ఐక్య విద్యార్థి సంఘాలు ఈ డి ఎస్ యు, ఏఐఎస్బి, ఎన్ ఎస్ యు ఐ, పిఎస్ యు, ఏపీ ఎస్ ఎఫ్.
విశాలాంధ్ర -ధర్మవరం; నెట్, నీట్ రాసినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలి అని, కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ విజయవంతం కావడం జరిగిందని ఐక్య విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి పేర్కొన్నాయి. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాను నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదుపరి పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి నిరంజన్ యాదవ్ ఏపీ ఎస్పీ జిల్లా కార్యదర్శి పోతులయ్య పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర, ఎన్ ఎస్ యు ఐ గణేష్ , ఏపీ ఏ ఎస్ ఎఫ్ శివ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పజెప్పాలి అని, పిహెచ్ డి అడ్మిషన్ల కోసం తప్పనిసరి నెట్ విధానాన్ని తొలగించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ బందు ధర్మవరం పట్టణంలో లో విజయవంతం చేయడం జరిగింది అని తెలిపారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని ,ఎన్ టి ఏ సంస్థను రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, ప్రభుత్వ పాఠశాల మూసివేతను ఆపాలని, వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు, నిర్బంధాలు పై దేశవ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాలు దేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతూ ఉందని మండిపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పాఠశాల మూసివేతను తీసుకురావడం సిగ్గుచేటటువంటి విషయమని, ఇప్పటికే వేల పాఠశాలలు మూసివేశారని, ఈ పాఠశాలల మూసివేత నిర్ణయానికి వ్యతిరేకంగా జాతీయ విద్యా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలను రాష్ట్రాలకు అప్పజెప్పాలని తెలిపారు. అదేవిధంగా నీట్ పైన సమగ్ర విచారణ జరిపించి ఎన్టిఏ ని రద్దు చేయాలని, నీట్ ని రద్దుచేసి, అక్రమాలకు పాల్పడినటువంటి వారి మీద కఠిన చర్యలు చేపట్టాలని, వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. వీటి మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే స్పందించాలని, లేని పరిస్థితులలో రాబోయే రోజులలో విద్యార్థి లోకాన్ని విద్య వ్యవస్థను నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉందని,రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వేచ్ఛని కూడా కేంద్ర విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నదని, దీనిమీద తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించి ,విటి మీద అసెంబ్లీలో చర్చించాలని తెలిపారు. అదేవిధంగా వారి ఎంపీలతో పార్లమెంటులో కూడా చర్చించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్మవరం పిడిఎస్యు పట్టణ కార్యదర్శి సుకృత్ పట్టణ అధ్యక్షులు నందకిషోర్ ఏఐఎస్బి పట్టణ అధ్యక్షులు నంద , ఆదర్శ్, అస్లాం, బన్నీ, కార్తీక్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img