London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి

రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నామని, పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలి లో శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్ ధర్మవరం,శంకరా కంటి ఆసుపత్రి -, జిల్లా అంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం భర్త కలవల మురళీధర్, కుమారుడు కలవల నాగ తేజ, కోడలు శర్వాణి, మనవడు కాలువల మీ హాను,సుకన్య సిల్క్స్- ధర్మవరం వారు వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. శిబిరంలో పాల్గొనే కంటి రోగులు అందరికీ వైద్య చికిత్సలు అందించిన తర్వాత అందులో కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, ఉచితంగా రవాణా ఖర్చులు, ఉచితంగా అద్దాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చువారు బిపి షుగర్ ఎక్కువ ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని, తగ్గించుకొని, రావాలని తెలిపారు. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా గుర్తింపు ఓటర్ కార్డు లలో రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు, మీ ఫోన్ నెంబర్ తో సహా శిబిరానికి రావాల్సి ఉందన్నారు. క్యాంపుకు వచ్చువారు ఈ హెచ్ ఎస్ కార్డు గాని, ఆరోగ్యశ్రీ కార్డు గాని, మిగిలిన ఏ కార్డు కూడా తీసుకొని రావలసిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని, ఆపరేషన్ కొరకు వెళ్లిన వారికి బెంగళూరులో భోజనము, వసతి, ఇతర సౌకర్యమును కూడా ఉచితంగా కల్పించబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణము మండల పరిధిలోని వివిధ గ్రామాల పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, తమ కంటికి తగిన ఆరోగ్యమును ఇస్తూ కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్, నేషనల్ పల్స్ పోలియో చైర్మన్, రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా చైర్మన్ రత్నశేఖర్ రెడ్డి, రమేష్ బాబు శివయ్య శ్రీనివాసరెడ్డి బండారు వెంకటాచలం, పెరుమాళ్ళ దాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img