London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డికొమరయ్య

. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారంకై పోరాడాలి
. సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్

విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డీ కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వ కార్మిక మతోన్మాద విధానాలపై పోరాడాలని సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ అన్నారు.సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ పార్టీ ఆఫీసులో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 78 వర్థంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సంధర్భంగా కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ 1946 లో తెలంగాణ ప్రాంతం లో వెట్టికి వ్యతిరేకంగా, భూమి, భుక్తి వెట్టి చాకిరి విముక్తి నిజాం నవాబు, దొరల భూస్వామ్య వ్యవస్థ కు వ్యతిరేకంగా సామాన్యులు ఆయుధం పట్టి ఎర్రజెండ నాయకత్వంలో పోరాటం చేసి చాకిలీ ఆయిలమ్మ భూమీ పై కన్నేసిన ఇసునూర్ రామ చంద్ర రెడ్డి కి వ్యతిరేకంగా ప్రజలందరూ కదివెండి గ్రామంలో జరిపిన ర్యాలీ లో దొరల భూస్వామ్య గుండాలు జరిపిన కాల్పుల్లో మరణించిన వీరుడు కొమరయ్య అన్నారు. కొమరయ్య మరణం యావత్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి చివరకి నైజాం నవాబు గోరి కట్టి దున్నే వానికి భూమీ హక్కు సాధించుకున్న చరిత్ర ఎర్ర జెండా నాయకత్వం నడిసిన తెలంగాణ రైతాంగ పోరాటానికి ఉందన్నారు.ఈ 78 ఏండ్ల చరిత్రలో నేడు కేంద్రం లో ఉన్నా బిజేపి ప్రజలను విభజించు పాలించు అనే బ్రిటిష్ దోపిడీ విధానాన్ని నేడూ అమలు జరుపు తున్నారన్నారని,నిరుద్యోగం, అధిక ధరలు,ప్రయివేటీకరణ,ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
కేంద్రము లోనీ బిజేపి సంకీర్తన ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,మత రాజకీయాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని అయన కొరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జి వెంకన్న,పార్టీ మండల కమిటీ సభ్యులు ఆర్. స్వాతి,ఎస్కే బురాన్, కే శీను, కరుణాకర్ సాధులు,కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img