విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరన్ క్యాంపులు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఎముకల డాక్టర్) డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి 19 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. తదుపరి 20 రోజులలో సర్టిఫికెట్ మీ సేవలో గాని, సచివాలయంలో గాని పొందవచ్చునని తెలిపారు. ఈ సర్టిఫికెట్ వల్ల శరీరంలో ఏ భాగం ఎంత శాతం దెబ్బతిన్నది అనేది తెలుస్తుందీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ లావణ్య పాల్గొన్నారు.