విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని కేతిరెడ్డి కాలనీకి చెందిన టి.ఆర్.చంద్రాయుడు ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిన్న కుమార్తె గ్రామ సచివాలయం వార్డు హెల్త్ సెక్రటరీ టి.ఆర్ ముకుంద, వారి భర్త శివ ప్రతాప్ దంపతులు అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.టి.ఆర్.చంద్రాయుడు,8వ వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ, గొట్లూరు అనాధ ఆశ్రమం లో అన్నదానం చేసారు. భవిష్యత్ లో సేవా కార్యక్రమాలు మరిన్ని చేయగలమని ముకుందమణి తెలియజేశారు. దాతలకు ఆశ్రమం ఫౌండర్ ఎల్. ప్రఫుల్ల చంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు.