London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

దేశ భక్తా…!? క్రికెట్‌ భక్తా…!?

‘‘నీకు దేశభక్తి లేదు నాన్న’’ అంది నా కూతురు టీ 20 ఫైనల్‌ మ్యాచ్‌ చూస్తున్న నన్ను. ఇలా అన్న సందర్భం ఇండియా – దక్షిణాఫ్రికా ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌ చేతిలోంచి జారిపోతోంది అనుకుంటున్నప్పుడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 15 ఓవర్‌ చూస్తూ నన్ను నిందా పూర్వకమైన తిట్టు తిట్టింది. ఆ ఓవర్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ క్లాసెన్‌ కొట్టిన రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు చూసిన నేను ఆ షాట్లు ఆడిన తీరుకు ముగ్దుడినై ‘‘ బ్యూటిఫుల్‌ బ్యాటింగ్‌ ‘‘ అన్న పాపానికి మా అమ్మాయికి కోపం వచ్చింది. ప్రముఖ కవి ఖాదర్‌ మొహిద్దీన్‌ తన పుట్టుమచ్చ కావ్యంలో ‘‘క్రికెట్‌ మ్యాచ్‌ నా దేశభక్తికి తూనికా కొలమానమూ అవుతుంది’’ అంటారు. మా అమ్మాయి మాటలు విన్న నాకు ఆ కవితా పంక్తులే గుర్తుకొచ్చాయి. స్వతహాగా క్రికెట్‌ ఆటగాడ్ని కూడా కావడంతో క్లాసెన్‌ బ్యాటింగ్‌ నాకు చాలా నచ్చింది. వొత్తిడిలో కూడా స్వేచ్ఛగా ఆడిన తీరు అద్భుత మనిపించింది. సరే, ఆ తర్వాత భారత్‌ తిరిగి మ్యాచ్‌ని తన చేతిలోకి తీసుకుని అపూర్వమైన విజయం సాధించింది. 17 సంవత్సరాల తర్వాత అందుకున్న ఈ విజయంలో భారత జట్టు సభ్యులందరి పాత్ర చాలా ఉంది. కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చిన పరుగుల మిషన్‌ విరాట్‌ కొహ్లి, తమ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పిన బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, లీగ్‌ మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో జట్టును ఫైనల్‌కు తీసుకువచ్చిన రోహిత్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌… ఇలా అందరి పాత్ర అద్భుతం. అయితే, వీళ్ల ఆట వెనుక ఓ అనుభవం సాదాసీదాగా అక్కడక్కడే తచ్చాడుతూ టీవీ స్క్రీన్‌లపై కనిపించింది. ఫైనల్‌ గెలిచిన తర్వాత ఆ అనుభవం కంట కన్నీళ్లు వచ్చాయి. అది కన్నీటి సంద్రం కాదు. ఉద్వేగ గోదావరి. ఉద్విగ్న గంగమ్మ. అతడే భారత్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌. ది వాల్‌ అని పిలుచుకునే రాహుల్‌ ద్రావిడ్‌ తాను మైదానంలో ఆడినన్ని రోజులూ నిజమైన వాల్‌లాగే ఆడేవాడు. ఇప్పుడు మైదానం వెలుపల కూడా జట్టుకు అండగా ఆ వాల్‌ నిలబడిరది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత జట్టులో ఆటగాళ్లంతా కన్నీరు కార్చారు. కానీ, ఓ కోచ్‌ కూడా కంటతడి పెట్టుకోవడం, ఆకాశం వైపు చూస్తూ పాపిలాన్‌ సినీ నవల్లో హీరో ‘‘బాస్టర్డ్స్‌… స్టిల్‌ ఐయామ్‌ అలైవ్‌’’ అని అరిచినట్లుగా…. ‘‘ ద్రావిడ్‌ ఈజ్‌ స్టిల్‌ అలైవ్‌… ఫర్‌ ఎవర్‌…’’ అన్నట్లుగానే అనిపించింది నా మటుకు నాకు.
ఫైనల్‌లో గెలుచుకున్న కప్‌ని విరాట్‌ కొహ్లీ కోచ్‌ ద్రావిడ్‌ చేతిలో పెడితే దాన్ని ముద్దాడి అరిచిన అరుపులకు ఏ భాషలోనైనా పదముంటుందేమో కాని క్రికెట్‌ భాషలో మాత్రం అది మౌనరాగమే. అదేమిటి… ద్రావిడ్‌ తన అరుపులతో ఆనందాన్ని పంచుకున్నాడు కదా అంటారా… అదీ నిజమే, కానీ అతని మనసుపొరల్లో దాగున్న విజయకాంక్ష గురించే నే చెప్పేది. అలనాడు జట్టు కెప్టెన్‌గా ఈ పొట్టి కప్‌ సాధించలేకపోయాడు. కానీ నేడు అదే దేశానికి కోచ్‌గా, అది కూడా ఇదే తన చివరి మజిలీ అని తెలిసిన తర్వాత తన శిక్షణలో కుర్రాళ్లు కప్‌ గెలవడం పైకి వినిపించిన అరుపుల కంటే ద్రావిడ్‌ లోలోపలి మౌనరాగమే చాలా తీవ్రమైన భావోద్వేగం.
ఇతర దేశాల గురించి నాకు తెలియదు కాని భారతదేశంలో మాత్రం క్రికెట్‌ను ఓ ఆటగా చూడడం మానేసి చాలా సంవత్సరాలైంది. ఈ క్రీడ కూడా రాజకీయంగా మారిన దుర్భర పరిస్ధితులు వచ్చేశాయి. దీని ప్రభావం ఆటగాళ్ల మీద కూడా చాలా తీవ్రంగానే పడుతోంది. మొన్నీమధ్య చూశాను ఓ టీవీ షోలో. ప్రఖ్యాత క్రికెటర్‌ గవాస్కర్‌ ఆనాటి రోజుల్ని వివరించారు. పాకిస్థాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో మియాందాద్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారట. బౌలర్‌ బాల్‌ వేయగానే ముందుకు వచ్చి ఫార్వర్డ్‌ డిఫెన్స్‌ ఆడి ఆ బౌలర్‌తో ‘‘మీ హోటల్‌ ఎక్కడ ‘‘ అని పదే పదే అడుగుతున్నారట. ఈ మాట వికెట్‌ కీపర్‌ సయ్యద్‌ కిర్మానీకి వినపడి ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గవాస్కర్‌తో ‘‘హోటల్‌ గురించి అడుగు తాడేమిటి అన్నాడట’’. ఇదే విషయాన్ని గవాస్కర్‌ ఓవర్‌ ముగిసిన తర్వాత మియాందాద్‌ని అడిగితే హాయిగా నవ్వుతూ ‘‘బాల్‌ని అక్కడికి పంపిద్దామని’’ అని సమాధానమిచ్చాడట. తర్వాత ఓవర్లో లెగ్‌ స్పిన్నర్‌ వేసిన మూడు బంతులు క్రీజ్‌ బయటకు వచ్చి ఎడమకాలుతో అడ్డుకున్నాడట మియాందాద్‌. నాలుగో బంతి వేసే సమయంలో ‘‘బంతిని మార్చు భాయ్‌… ఎడమ కాలు మీద కుక్క కరిచింది. మాటి మాటికి అక్కడే తగులుతోంది. నొప్పిగా ఉంది’’ అని చమత్కరించాడట. ఎంత బాగుండేది ఈ క్రికెట్‌ అనిపించింది ఆ షో చూశాక. విచారకర మేమిటంటే అదే మియాందాద్‌ భారత్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో పిచ్‌పైనే కుప్పిగంతులు వేయడం, బౌలర్‌ని హేళన చేయడం. పొరుగు దేశంతో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే యుద్ధంలా మారడానికి ఈ సంఘటనే పునాది వేసిందేమో అనుకుంటా నేనైతే. ఈ పిచ్చి ఎంత వరకూ వెళ్లిందంటే పొరపాటును మ్యాచ్‌ ఓడితే ఆ పిచ్‌ని తవ్వేసే వరకూ వెళ్లింది. అది అలా అలా పాకి చివరికి దేశభక్తిని నిరూపించుకునే వరకూ వెళ్లింది.
నాకు దేశభక్తి అంటే శ్రీరామ నవమి చలువ పందిళ్ల కింద ప్రసాదంగా పంచిన వడపప్పు తినడం, పానకం తాగడం…
నాకు దేశభక్తి అంటే రంజాన్‌ నాడు వచ్చే నెలవంక నాకు కూడా కనిపించడం…
నాకు దేశభక్తి అంటే క్రిస్టమస్‌ నాడు జాతీయ క్రీడా జర్నలిస్టు మోజస్‌గాడు ప్రేమతో నోటికి అందించిన కేక్‌ తినడం…
నాకు దేశభక్తి అంటే దేశం గెలవడం… ప్రత్యర్ధి జట్టు అద్భుత ఆటతీరుని ప్రశంసించడం…
నాకు దేశభక్తి అంటే చాంతాడు లాంటి క్యూలో నిలబడి క్రమశిక్షణతో ఓటు వేయడం…
సీనియర్‌ జర్నలిస్టు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img