London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఫార్మా యాజమాన్యాలు బరి తెగింపు!

ఫార్మా వ్యర్థాల నిల్వ కేంద్రంగా బచ్చల బంధ
విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి జిల్లా); ఫార్మా కంపెనీ యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. ప్రమాదకర ఫార్మా కెమికల్ వ్యర్థాలను ఎక్కడ బడితే అక్కడ విడిచి పెడుతున్నారు. పరవాడ మండలం పెదముషిడివాడలో సోమవారం ఉదయం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్థానిక జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న బచ్చల బందలో సుమారు 80 డ్రమ్ములతో కెమికల్ వ్యర్థాల నిల్వలు బయట పడ్డాయి. అటుగా వెళ్లిన పలువురు స్థానికులు డ్రమ్ములను గుర్తించి మూత ఓపెన్ చేయడంతో విపరీతమైన దుర్వాసన వెదజల్లింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు వచ్చి చూసే సరికి అప్పటికే కొన్ని డ్రమ్ముల నుంచి కింద పడి కెమికల్ వ్యర్థాలు బంధలో చేరాయి. అయితే ఈ కెమికల్ వ్యర్థాలను ఫార్మా యాజమాన్యాలే అర్ధ రాత్రి వేళ చెరువులో పారబోసేందుకు తీసుకొచ్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరో ఉన్నట్లు అలికిడి వినిపించడంతో కెమికల్ ను కింద పారబోయకుండా అక్కడ నుంచి పరారై ఉంటారని తెలుస్తోంది. ఇందులో ఓ వైసీపీ చోటా నాయకుడి హస్తమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు గాను అతనికి కొంత మొత్తంలో అందినట్లు స్థానికులు చెబుతున్నారు. తన అక్రమార్జన కోసం బచ్చల బందను ఫార్మా కెమికల్ వ్యర్థాల నిల్వ కేంద్రంగా మారుస్తున్నాడని ఆరోపిస్తున్నారు. పైగా పంట పొలాలకు సాగునీరందించే చెరువుల్లో నిర్లక్ష్యంగా ప్రమాదకర కెమికల్ ను విడిచి పెట్టడం దుర్మార్గమని మండి పడుతున్నారు. దీనిపై పీసీబీ అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపించి సంబంధిత కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న రాంకీ యాజమాన్యం చెరువులో డంప్ చేసిన కెమికల్ డ్రమ్ములను అక్కడ నుంచి తరలించారు. కానీ కింద పడ్డ వేల లీటర్ల కెమికల్ వ్యర్థాలను మాత్రం మట్టితో కప్పేశారు. దీంతో ఈ ప్రమాదకర కెమికల్ వ్యర్థాలు భూమిలో ఇంకి భూ గర్భ జలాలు విషతుల్యం అయ్యే ప్రమాదం లేకపోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img