Friday, October 25, 2024
Friday, October 25, 2024

హర్యానాలో ‘ఇండియా’కు అనుకూలం

డా. జ్ఞాన్‌ పాఠక్‌

హర్యానా అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్‌బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. ఇండియా ఐక్య సంఘటనలో కాంగ్రెస్‌ఆప్‌ పార్టీలు భాగస్వాములుగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో కలసి పోటీచేయడంలేదని కాంగ్రెస్‌ తెలియజేసింది. ఇంతకుముందే ఆప్‌ కాంగ్రెస్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించింది. 2024 సెప్టెంబరు`అక్టోబరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్‌డీఏ కూటమి నుంచి జేజేపీ వైదొలగింది. అందువల్ల బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇటీవల లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వ్యవసాయ దుష్ట చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు మహత్తర ఆందోళన చేసినదాని ప్రభావం బీజేపీని దెబ్బతీసింది. హర్యానాలో పది లోక్‌సభ సీట్లుండగా ఐదుసీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం పది సీట్లు గెలుచుకున్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదు సీట్లు కోల్పోయింది. హర్యానా అసెంబ్లీ గడువు 2024 నవంబరు 3వ తేదీతో ముగుస్తుంది. హర్యాన, దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌, ఆప్‌ విడివిడిగా పోటీ చేయనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా ఐక్యసంఘటన పార్టీలు కలిసి పోటీచేయనున్నాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్‌ ప్రకటించారు. ఇండియా ఐక్య సంఘటనలో కాంగ్రెస్‌, ఆప్‌ భాగస్వాములై లోక్‌సభ ఎన్నికలవరకే పొత్తు పరిమితమని, అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీచేస్తామని ఆప్‌ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. హర్యానా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 9 సీట్లకు, ఆప్‌ ఒక సీటుకు పోటీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కచ్చితంగా ఓడిరచి తాముతప్పనిసరిగా గెలుస్తామని హర్యానా కాంగ్రెస్‌ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తుంది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 46.11శాతం ఓటింగ్‌ నమోదైంది. కాంగ్రెస్‌కు 43.67శాతం ఓట్లు వచ్చాయి. ఆప్‌కు 3.94శాతం ఓట్లు వచ్చాయి. జేజేపీకి 0.8శాతం ఓట్లు మాత్రమేవచ్చాయి. మరో ప్రాంతీయపార్టీ ఐఎన్‌ఎల్‌డికి 1.74శాతం ఓట్లు లభించాయి. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో దాదాపు పూర్తిగా ఓటర్ల మద్దతు కోల్పోయింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌, బీజేపీలు ముఖాముఖిగా పోటీ చేయనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితిని చూసినప్పుడు డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పైన ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారని స్పష్టమైంది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రైతులు, పంజాబీలు మాజీ ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌పై తీవ్ర ఆగ్రహంతోఉన్నారు. ఖట్టర్‌ను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించినప్పటికీ ఆయనపై ఆగ్రహాన్ని ప్రజలు విడిచిపెట్టలేదు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాయబ్‌సింగ్‌సైని సైతం దిగజారుతున్న బీజేపీ రాజకీయ భవిష్యత్‌ను నిలువరించలేని స్థితిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఈ అంశాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 90 నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో 42మంది ఎంఎల్‌ఏలున్నారు. ప్రభుత్వ ఏర్పాటకు తగినంతమంది ఎంఎల్‌ఏలు లేరు.
హెచ్‌ఎల్‌పికి చెందిన ఒకరు, ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఏలు బీజేపీకి తోడ్పాటునిస్తున్నారు. ఎన్‌డీఏకు మొత్తం 44 మంది ఎంఎల్‌ఏలున్నారు. మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల బొటాబొటిగా ఉన్న సభ్యులతో ప్రభుత్వం ఉన్నది. ఈ సంవత్సరం మార్చిలో జేజేపీ ఎన్‌డీఏ నుంచి బైటకు వెళ్లిపోయింది. అప్పుడు జేజేపీకి పదిమంది ఎంఎల్‌ఏలు ఉన్నారు. ఈ పార్టీ అప్పుడు అధికార హోదా అనుభవించింది. కాంగ్రెస్‌కు 28 సీట్లున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకత్వంలో జేజేపీ, నలుగురు ఇండిపెండెంట్లు భాగస్వాములుగా ఉన్నారు. ఐఎన్‌ఎల్‌డి పార్టీ ఒక స్థానం కలిగిఉంది. అయితే అటు కాంగ్రెస్‌తోనూ,ఎన్‌డీఏతోనూ లేదు.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 31సీట్లు వచ్చాయి. జేజేపీ పది, హెచ్‌ఎల్‌పీకి ఒకటి, ఐఎన్‌ఎల్‌డికు ఒక స్థానం ఉన్నాయి. ఏడుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. జేజేపీ, హెచ్‌ఎల్‌పీ, ఒక ఇండిపెండెంట్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు కొద్దినెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీవ్రంగా దెబ్బతినింది. లోక్‌సభ ఎన్నికల్లో 58.3శాతం ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓట్లశాతం 36.49కి తగ్గింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఓట్ల శాతం 46.11కు పెరిగింది. 2019లో కాంగ్రెస్‌ ఓట్ల శాతం 28.08 ఉండగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు 43.67శాతానికి పెరిగింది.
ఇతర అన్ని చిన్నచిన్న పార్టీలకు ఓట్లు దాదాపు పూర్తిగాలేకుండా పోయాయని లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైంది. అయితే జేజేపీకి, ఐఎన్‌ఎల్‌డికి రాష్ట్రంలో అక్కడక్కడ పలుకుబడి ఉంది. అ నేపధ్యంలో కాంగ్రెస్‌ ఎవరితోనూ పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు జేజేపీ సభ్యులు, నలుగురు ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తున్నప్పటికీ చివరికి ఎవరికి వారే పోటీ చేయవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img