Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Monday, September 30, 2024
Monday, September 30, 2024

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారుల యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని ఆరోగ్యశాఖ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ విభాగాల అధికారుల ద్వారా ప్రగతి, మండలాల సమస్యలను, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో నాకు అనవసరమని, ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల యొక్క సహాయ సహకారాలు నాకు అవసరము ఉన్నాయని, మీ సమస్యలు ఏమి ఉన్నా తప్పక పరిష్కరించే దిశలో పాటుపడతారని వారు హామీ ఇచ్చారు. గత హాయంలో నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ విభాగాలలో జరిగిన అవకతవకలు పై పరిశీలన ఉంటుందని తెలిపారు. పల్లె ప్రాంతం నుండి పట్టణము వరకు ప్రజలు ఎవ్వరు కూడా సమస్యలు పరిష్కరించబడలేదు అన్న ఫిర్యాదు అందితే తప్పక కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరిచి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేరా కృషి చేయాలని వారు తెలిపారు. విద్య వైద్య తదితర వాటిపై అందరూ దృష్టి పెట్టి ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు అధికారుల యొక్క కృషి, పట్టుదల, సేవాభావం, ఉద్యోగం పట్ల నిబద్ధత ఎంతో అవసరమని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు మండల గ్రామాల వారిగా ఏమైనా ఉంటే అధికారులు తప్పకుండా నా దృష్టికి తీసుకుని రావాలని, తప్పక సంబంధిత మంత్రుల ద్వారా, సంబంధిత జిల్లా, రాష్ట్ర అధికారుల ద్వారా పరిష్కరించేలా తాను కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, నియోజకవర్గ అధికారులు, స్థానిక మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img