Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ముస్లిం మహిళలు భరణానికి అర్హులే నని సుప్రీంకోర్టు కీలక తీర్పు పై సిపిఐ జిల్లా సమితి హర్షం

విశాలాంధ్ర -అనంతపురం : విడాకులు తర్వాత ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు .దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్, జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం కొట్టి వేసిందని భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది అన్నారు. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్ విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపిందన్నారు. సెక్షన్ 125 వివాహితలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుంది అని మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితులు భరణం కోరవచ్చు అని తెలియజేయడం జరిగిందన్నారు భరణం ఇవ్వడం అనేది దాతృత్వం లేదా విరాళం కాదన్నారు. భార్య తమపై మానసికంగా ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందని వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదన్నారు. గృహని పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది అని ధర్మాసనం తీవ్రంగా స్పందించిందన్నారు. ఇంటి పట్టున ఉంటూ భార్య తమపైనే ఆధారపడి ఉంటుందన్న కనీస ఇంగితం కూడా కొంతమంది భర్తలకు ఉండడం లేదు అని తెలియజేయడం జరిగిందన్నారు. భావోద్వేగ పరంగా కూడా అలాంటి మహిళలు భర్త పైనే ఆధారపడి ఉంటారన్నారు. ఇప్పటికైనా గృహినిల విలువ వాళ్ళెంత త్యాగం చేస్తున్నారో పురుషులు అర్థం చేసుకోవాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు చివాట్లు పెట్టిందని పేర్కొన్నారు. తగిన ఆదాయ మార్గాలు కలిగి ఉన్న వ్యక్తి తన భార్య పిల్లలు లేదా తల్లిదండ్రులకు భరణాన్ని తిరస్కరించలేరని సెక్షన్ 125 చెబుతోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img